»   » బాలయ్యపై ‘ఇండియా టుడే’ స్పెషల్ రిలీజైంది (ఫోటోస్)

బాలయ్యపై ‘ఇండియా టుడే’ స్పెషల్ రిలీజైంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ పై ప్రఖ్యాత ఇండియా టుడే మ్యాగజైన్ ఓ స్పెషల్ ఎడిషన్ ను ఈరోజే విడుదల చేసింది. ఏపీ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడు ఈ ఎడిషన్ ను ఆవిష్కరించారు. బాలకృష్ణ తన సినిమా జీవితంలో 99 సినిమాలు పూర్తిచేసి 100వ సినిమా దిశగా సాగుతున్నందుకుగాను ఇండియా టుడే ఈ ఎడిషన్ ను ప్రచురించింది.

ఈ ఎడిషన్ లో బాలకృష్ణ సినీ రంగంలోకి ఎలా వచ్చారు.. ఎన్టీఆర్ వారసత్వాన్ని ఎలా కొనసాగించారు అనే అంశాలతో పాటు రాజకీయ రంగంలో ఆయన వేసిన అడుగులు, సేవా రంగంలో తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేరుస్తున్నారు వంటి అంశాలను ప్రస్తావించారు. పూర్తి తెలుగు భాషలో విడుదలైన ఈ ఎడిషన్ కు 'ది లెజెండ్' అన్న టైటిల్ ను పెట్టారు.

బాలయ్య ఇప్పటికీ కుర్రహీరోలతో సైతం పోటీపడుతూ తన సత్తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే వున్నారు. సినిమా లేకపోతే తాను లేనని ఘనంగా చాటుకున్న వ్యక్తి. రాజకీయ కుటుంబంలో ఉన్నా చాలా కాలంగా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసి హిందూపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగ పెట్టారు. ఓ వైపు నటుడిగా తన ప్రస్తానం కొనసాగిస్తూనే.... ఎమ్మెల్యేగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

1974, జులై 29వ తేదీన బాలయ్య 'తాతమ్మ కల'చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. ఈ చిత్రంలో ఆయన భానుమతి మనవడిగా నటించారు. ఈ చిత్రానికి బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించడం విశేషం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా వెండితెరపై వెలుగొందుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వరకు 99 సినిమాల్లో నటించారు.

మద్రాసులో 1960, జూన్‌ 10న జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌కి ఆరో సంతానం. డిగ్రీ వరకు చదువుకున్నారు. 1974లో 14 ఏళ్ళ వయసులోనే బాలనటుడిగా తాతమ్మ కల చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన రామ్‌ రహీం చిత్రంలో నటించి నటనపై తనకున్న మక్కువను చాటారు.

ఇండియా టుడే

ఇండియా టుడే


నందమూరి నటసింహం బాలకృష్ణ పై ప్రఖ్యాత ఇండియా టుడే మ్యాగజైన్ ఓ స్పెషల్ ఎడిషన్ ను ఈరోజే విడుదల చేసింది.

చంద్రబాబు

చంద్రబాబు


ఏపీ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడు ఈ ఎడిషన్ ను ఆవిష్కరించారు.

ప్రత్యేక సంచిక

ప్రత్యేక సంచిక


బాలకృష్ణ తన సినిమా జీవితంలో 99 సినిమాలు పూర్తిచేసి 100వ సినిమా దిశగా సాగుతున్నందుకుగాను ఇండియా టుడే ఈ ఎడిషన్ ను ప్రచురించింది.

ది లెజెండ్

ది లెజెండ్


పూర్తి తెలుగు భాషలో విడుదలైన ఈ ఎడిషన్ కు ‘ది లెజెండ్' అన్న టైటిల్ ను పెట్టారు.

English summary
India Today Telugu magazine is published a special edition on Balakrishna for focus him as the legend and all-rounder in his life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X