ఈ వారం నాగార్జున కింగ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఇండియాటుడే(తెలుగు)వారు ఓ ప్రత్యేక ఎడిషన్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మొత్తం నాగార్జునకి సంభందించిన ఆర్టికల్స్ తో నిండిఉంటుంది. ఇక ఆర్టికల్స్ కూడా నాగార్జున,చిరంజీవి,వెంకటేష్ వంటి తెలుగు సినీ ప్రముఖుల రాసినవే ఉండబోవటం మరో స్పెషలని తెలుస్తోంది. గత సంవత్సరం చిరంజీవిపై ఇలాంటి ఇష్యూ ఇండియా టుడే వెలువరించిన సంగతి తెలిసిందే.