కమల్‌ హాసన్‌కు పోలీసుల మరో షాక్.. కాజల్‌‌‌ను ప్రశ్నించనున్న క్రైమ్ బ్రాంచ్

ఇండియన్ 2 షూటింగ్‌లో ప్రమాద ఘటనతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన కమల్ హాసన్‌కు మరో షాక్ తగిలింది. ఈ దుర్ఘటనపై విచారణ‌ను వేగవంతం చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రమాద ఘటనపై పలువురిని ఆరా తీస్తున్నారు. ఇటీవల ఇండియన్ 2 షూటింగ్‌లో చోటుచేసుకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కమల్ హాసన్‌కు సమన్లు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..

పలు కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు

పలు కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు

ప్రమాద ఘటనపై సోమవారం ఉదయం దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్‌ను పోలీసులు ప్రశ్నించారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారు. ప్రమాదం ఘటనపై పలు కోణాల్లో విచారించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారి నుంచి వివరాలు సేకరిస్తాం అని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు.

శంకర్, కమల్ నుంచి మరింత సమాచారం..

శంకర్, కమల్ నుంచి మరింత సమాచారం..

శంకర్, కమల్ హాసన్‌ను విచారించే సమయంలో సెఫ్టీ చర్యల గురించి పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం ఈ సందర్భంగా స్పష్టమైన సమాచారాన్ని వారి నుంచి సేకరించే ప్రయత్నం చేశారు. ఆ రోజున జరిగిన విషయాలను పోలీసులకు శంకర్, కమల్ ఇచ్చారని, అంతేకాకుండా ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా సహకారం అందిస్తామని తెలియజేసినట్టు లైకా నిర్వాహకులు తెలిపారు.

 కాజల్ అగర్వాల్‌తోపాటు మరికొందరిని

కాజల్ అగర్వాల్‌తోపాటు మరికొందరిని

ఇండియన్ 2 ప్రమాదం జరిగినప్పుడు సెట్లో ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఇతర టెక్నికల్ టీమ్ సభ్యులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. త్వరలోనే ప్రతీ ఒక్కరి నుంచి ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తామని పోలీసులు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. అయితే పోలీసుల విచారణకు కాజల్ హాజరవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Recommended Video

Director Shankar Responds On Indian 2 Crane Mishap | Filmibeat Telugu
క్రేన్ విరిగి పడటంతో

క్రేన్ విరిగి పడటంతో

ఫిబ్రవరి 19వ తేదీన చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఇండియన్ 2 షూటింగ్ జరుగుతుండగా.. క్రేన్ విరిగి సెట్లో పనిచేస్తున్న వారిపై పడింది.ఆ ఘటనలో మధు, చంద్రన్, కృష్ణన్ అక్కడికక్కడే మరణించారు. దాదాపు 12 మంది గాయాలపాలు కావడం తెలిసిందే. ఈ ఘటన దక్షిణాది సినీ పరిశ్రమనే కాకుండా యావత్ భారత సినీ రంగాన్ని షాక్ గురి చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X