»   » హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇక మీ అరచేతిలో, ఫ్యాన్స్‌కి బోలెడు లాభాలు కూడా!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇక మీ అరచేతిలో, ఫ్యాన్స్‌కి బోలెడు లాభాలు కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొబైల్ ఫోన్స్ పుణ్యమా అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్స్ ద్వారా ఏది కావాలన్నా క్షణాల్లో ముని వేళ్లతో సాధ్యం చేసుకునే వెసులుబాటు లభించింది. అందుకే ఇపుడు సినిమా స్టార్లు కూడా అభిమానులకు దగ్గరవ్వడానికి సోషల్ మీడియా‌తో పాటు.... తమ పేరుతో ప్రత్యేకంగా మొబైల్ యాప్స్‌ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేరారు.

తన సొంత యాప్ లాంచ్ చేసిన రకుల్

తన సొంత యాప్ లాంచ్ చేసిన రకుల్

అందం, తెలివితేటలతో అనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ మంగళవారం తన సొంత మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా అభిమానులతో ఎంగేజ్ అవ్వడం, వారితో ఇంటరాక్ట్ అవ్వడంలో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాలనేది రకుల్ ఆలోచన.

ఈ యాప్ ప్రత్యేకత ఏమిటి?

ఈ యాప్ ప్రత్యేకత ఏమిటి?

ఈ యాప్ అభిమానులను రకుల్‌కు మరింత చేరువ అయ్యేలా చేస్తుంది. రకుల్‌కు సంబంధించిన పర్సనల్ వివరాలతో పాటు ఆమె సినిమా విశేషాలు, సోషల్ మీడియా ఫీడ్ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతుంది. అంతే కాకుండా... ఫ్యాన్స్ దీని ద్వారా బహుబతులు, డబ్బులు, రకుల్‌ను కలిసే అవకాశం కూడా దక్కించుకోవచ్చు.

న్యూయార్క్ బేస్డ్ సంస్థతో

న్యూయార్క్ బేస్డ్ సంస్థతో

న్యూయార్క్‌కు చెందిన ఎస్కేప్‌ఎక్స్ అనే సంస్థతో కొలాబరేట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్..... ప్రత్యేకంగా ఈ యాప్ డిజైన్ చేయించుకున్నారు. ఈ యాప్‌లో చాలా విషయాలు ఉన్నాయని ఆమె తెలిపారు.

రకుల్ ఏమందంటే...

రకుల్ ఏమందంటే...

తన సొంత యాప్ లాంచ్ చేయడంపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.... ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, దీని ద్వారా అభిమానులకు మరింత దగ్గరవ్వడానికి వీలవుతుందని వెల్లడించారు.

అభిమానులు బహుమతులు, కరెన్సీ గెలుచుకోవచ్చు

అభిమానులు బహుమతులు, కరెన్సీ గెలుచుకోవచ్చు

ఈ యాప్ ద్వారా అభిమానులకు వివిధ రకాల కాంటెస్టులు నిర్వహించబోతున్నానని, దీని ద్వారా అభిమానులు బహుమతులు, నన్ను కలిసే అవకాశం కూడా దక్కించుకోవచ్చని, దీంతో పాటు వర్చువల్ కరెన్సీ కూడా గెలుపొంద వచ్చు. అభిమానుల్లో టాప్ పొజిషన్లో ఉన్న వారికి స్పెషల్ ట్రీట్స్ కూడా ఉంటాయని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.

English summary
Rakul Preet Singh announced today the release of her new mobile app Official App in collaboration with New York-based tech firm EscapeX. The new app will take fan engagement and interaction to the next level.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X