»   » రోడ్డు ప్రమాదంలో యంగ్ ఫిల్మ్ మేకర్ మృతి

రోడ్డు ప్రమాదంలో యంగ్ ఫిల్మ్ మేకర్ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్ విజయ్ మోహన్ మరణించారు. బైకుపై వెలుతున్న ఆయన్ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు విజయ్ మోహన్ మంగళవారం మరణించారు. చికాగోలో జన్మించిన విజయ్ మోహన్ వయసు 26 సంవత్సరాలు. ఆయన పాఠశాల విద్య ఇండియాలోనే సాగింది. సినిమాలపై ఆసక్తి పెంచుకున్నవిజయ్ ఆదిశగా అడుగులు వేసారు.

 Indian-American filmmaker Vijay Mohan dies

టెంపల్ యూనివర్శిటీ నుంచి ఫిల్మ్, మీడియా అర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. విజయ్ కి సినిమాలంటే చాలా ఇష్టమని, డెడికేషన్ తో పని చేసే వ్యక్తి అని ఫిల్మ్ అండ్ టెలివిజన్ కమ్యూనిటీ సభ్యులు తెలిపారు. ఇప్పుడిప్పుడే కెరీర్లో పైకి ఎదుగుతున్న విజయ్ అప్పుడే అనంత లోకాలకు వెల్లి పోవడంతో విషాదం నెలకొంది.

English summary
A 26-year-old aspiring Indian- American filmmaker has died over a week after he was hit by a car while riding a bike in his home town of Philadelphia.
Please Wait while comments are loading...