భారతీయ సినిమా 100 ఇయర్స్
భారతీయ సినిమా ఈ నెల 21తో విజయవంతంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. సరిగ్గా ఏప్రియల్ 21, 1913 తేదీన తొలి భారతీయ సినిమా 'రాజా హరిశ్చంద్ర' వెండి తెరపై వెలుగులు చిమ్మింది. పాల్కే స్వీయ దర్శకత్వంలో దీన్ని రూపొందించారు. కదిలే బొమ్మలను కళ్లముందు ఆవిష్కరించింది. అయితే 'రాజా హరిశ్చంద్ర' కంటే ముందే 1912లో 'పుండలీక' చిత్రం భారతీయతను ప్రతిభింబిస్తూ రూపొందినప్పటికీ దానికి పని చేసినవారంతా విదేశీయులే కావడంతో దాన్ని తొలి భారతీయ సినిమాగా ఎవరూ అంగీకరించలేదు.
కానీ రాజా హరిశ్చంద్ర మాత్రం పూర్తి గా భారతీయత సాంకేతిక నిపుణులతో రూపొందించారు. స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చిన చిత్రాలన్నీ దేశభక్తి ఉట్టిపడేలా తీసినవే.. అప్పటి చిత్రాల్లో క్రూరత్వం, నగ్నత్వం తక్కువగా ఉండటం వల్ల పెద్దగా సెన్సార్ అవసరం రాలేదు. కానీ తొలిసారి.. భక్త విధుర చిత్రం వివాదానికి తెరలేపింది. ఈ చిత్రం రాజకీయ కోణంలో తీసిన వివాదాస్పద చిత్రంగా భావించారు. ప్రధాన చిత్రాలకు పాటలే ప్రాణం.. ఒక్కోసారి ఈ సాహిత్యం సమాజాన్ని కదిలించేదిగా ఉండేది.
1943లో అశోక్ కుమార్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ కిస్మత్ ఓ సంచలనం.. అందులో దూర్ హఠో యే దునియా వాలా.. హిందుస్థాన్ హమారా.. అనే పాట.. వలస పాలకులకు ఓ సవాలుగా మారింది. భారతీయ చలన చిత్రంలో కొన్ని చిత్రాలు మైలు రాళ్లుగా నిలిచాయి. సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలి చిత్రం 1956లో బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్ బహుమతికి ఎంపికయింది. మరుసటి ఏడాది అమిత్ శంబు మిత్రా రూపొందించిన జగ్తేరహో చిత్రం కార్లోవీ వ్యారీ చిత్రోత్సవంలో మొదటి బహుమతి గెలుచుకోవడంతో భారతీయ దర్శకులకు తాము గొప్ప చిత్రాలను రూపొందించగలమనే ఆత్మస్థైర్యం పెరిగింది.
ఇండియన్ సినిమా శరవేగంగా అభివృద్ధి చెందింది. జాతీయ బాష నుంచి స్థానిక బాషల్లో కూడా చిత్రాలు తీయగలిస్థాయికి ఎదిగింది.. 1962లో మొదటి బోజ్ పురి చిత్రం.. గంగా మయ్యా థోహె పియరీ చదాహిబో.. విడుదలయింది. దీంతో ప్రాంతీయ బాషలు తమ మాండలికాల్లో భావోద్వేగాలను తెరకెక్కిండంలో విజయవంతం అయ్యాయి. 1950 మరియు 60లలో వస్తున్న అధునాతన బాషా పద్దతులను అనుసరిస్తూ జెమినీ, ఏవీఎం, ప్రసాద్ ప్రొడక్షన్స్ చిత్రాలను రూపొందించుకుంటూ వెళ్లాయి. ఇంతింతై వటుడింతై అన్న చందంగా భారతీయ చలన చిత్రం ఎదిగింది.. అంతర్జాతీయంగా భారీ వసూళ్లు రాబడుతున్నాయి.


Click it and Unblock the Notifications











