అల్లు అర్జున్‌పై మనసు పారేసుకున్న టీమిండియా ఉమెన్ క్రికెటర్
బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. ఎంతగానో కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే అదిరిపోయే నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
అంతేకాదు, సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ స్టైలిష్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. అందుకే బన్నీ అంటే తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ డ్యాన్స్‌కు చాలా మందే అభిమానులు ఉన్నారు.

ఇదిలాఉండగా, అల్లు అర్జున్‌ను అభిమానించే వాళ్లు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నారు. సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు సైతం అతడి యాక్టింగ్, డ్యాన్స్‌కు ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడీ జాబితాలోకి ఓ మహిళా క్రికెటర్ కూడా వచ్చి చేరింది. రాజస్థాన్‌కు చెందిన ప్రియా పూనియా భారత మహిళల జట్టులో సభ్యురాలు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 24 ఏళ్ల ఈ టాలెంటెడ్ క్రికెటర్‌కు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
ప్రియా పూనియా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన ఇష్టాఇష్టాలను వారితో పంచుకుంది. అదే సమయంలో తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. బన్నీ ఇప్పటి వరకు హిందీలో సినిమాలు చేయకున్నా.. అతడి ప్రతి సినిమా ఆ భాషలోకి డబ్ అవుతోంది. అక్కడ వాటికి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఇలానే ప్రియా.. బన్నీ ఫ్యాన్‌గా మారిందన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











