‘మహర్షి’ చూసిన ప్రముఖ క్రికెటర్.. మహేశ్‌కు పొగడ్తలు.. ప్రపంచకప్ వల్ల ఆలస్యమైందంటూ ట్వీట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు - స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మహర్షి'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో కనిపించాడు. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, విమర్శలకు ప్రశంసలు సైతం అందుకుంది. దీనిపై ఎంతో మంది సెలెబ్రిటీలు స్పందించారు.
తాజాగా ఈ సినిమాను ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చూశాడు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ''ఇప్పుడే 'మహర్షి' సినిమా చూశాను. ఇది నాకు బాగా నచ్చింది. ఒక బలమైన, స్ఫూర్తదాయకమైన మెసేజ్‌ను మనకు అందించారు. దీని గురించి తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. మహేశ్ బాబు నుంచి మరో పవర్ ఫుల్ ప్రదర్శన కనిపించింది'' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే యాభై రోజులు పైగా పూర్తయిన ఈ సినిమాను లక్ష్మణ్ ఆలస్యంగా చూడడానికి ప్రపంచకప్ కారణమని తెలుస్తోంది.

ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో లక్ష్మణ్ కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ టోర్నీ ముగిసే వరకు ఆయన ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. తన తోటి ఆటగాళ్లు సచిన్, సెహ్వాగ్‌తో పాటు హిందీ కామెంట్రీ చెబుతూ అలరించాడు. ఈ హైదరాబాదీ ఆటగాడు మణికట్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా కితాబందుకున్నాడు. భారత్ తరపున ఎన్నో మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన లక్ష్మణ్.. కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అలాగే, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులు ఎంత ప్రత్యేకమైనవో అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











