18 ఓటీటీలు, 19 వెబ్ సైట్లు, 10 యాప్స్, 57 అకౌంట్స్ బ్యాన్.. ఎందుకంటే?

ఈ మధ్య కాలంలో భారతదేశ ప్రభుత్వం అశ్లీల, అసభ్యకర కంటెంట్ ను ప్రొవైడ్ చేసే అందరిపై (ఓటీటీ ప్లాట్ ఫామ్స్, వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వెబ్ సైట్లు) కఠిన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఎలాంటి దయ చూపకుండా బ్యాన్ చేస్తూ.. షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బాడ్ కాస్ట్ మంత్రిత్వ శాఖ దేశంలోని 18 ఓటీటీ ప్లాట్ ఫామ్స్, 19 వెబ్ సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేసింది.

ముఖ్యంగా అశ్లీల, అసభ్యకర కంటెంట్ ను ప్రచురించే వీటిని నిషేధిస్తూ గట్టి చర్యలు తీసుకుంది. మార్చి 12వ తేదీన అశ్లీల, అసభ్యకర కంటెంట్ ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను తొలగించినట్లు కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. ఇతర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్ మెంట్ లతో కలిసి మీడియా, వినోదం, మహిళల హక్కులు, పిల్లల హక్కులను సంరక్షించే నిపుణులతోకలిసి.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Indian Government Banned 18 OTT platforms And 19 Web Sites 10 Apps and 57 Accounts check Details

బ్యాన్ అయినే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇవే..

1. డ్రీమ్స్ ఫిల్మ్స్
2. వూవి
3. యెస్మా
4. అన్ కట్ అడ్డా
5. ట్రై ఫ్లిక్స్
6.ఎక్స్ ప్రైమ్
7. నియోన్ ఎక్స్ వీఐపీ
8. బేషరమ్స్
9. హంటర్స్
10. రాబిట్
11. ఎక్స్ ట్రా మూడ్
12. న్యూఫ్లిక్స్
13. మూడ్ ఎక్స్
14. మోజ్ ఫ్లిక్స్
15. హాట్ షాట్స్ వీఐపీ
16. ఫుగి
17. చికూఫ్లిక్స్
18. ప్రైమ్ ప్లే

పైన చెప్పిన ప్లాట్ ఫామ్ లలో చూపించిన కంటెంట్ లో ఎక్కువ భాగం అశ్లీలత, అసభ్యత, మహిళలను కించపరిచే విధంగా ఉందని... అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని పాడు చేసే విధంగా ఉందని వాటిని నిషేధించినట్లు వివరించారు. ముఖ్యంగా కొన్ని సార్లు నగ్నంగా ఉండే వీడియోలతో పాటు లైంగిక చర్యలను కూడా చూపించినట్లు వెల్లడించారు. అందువల్లే వీటిని బ్యాన్ చేసినట్లు స్పష్టం చేశారు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ, ఐపీసీ సెక్షన్ లోని 292 అలాగే మహిళల అసభ్య ప్రాతినిధ్యం నిషేధం చట్టం, 1986లోని సెక్షన్ 4లను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీన్ని ఆధారంగా చేసుకునే వాటిని నిషేధించినట్లు వివరించారు. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను మొత్తం కోటి మందికి పైగా డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేసుకోగా.. గూగుల్ ప్లే స్టోర్ లో 50 లక్షలకు పైగా మంది డౌన్ లోడ్ చేసుకున్నట్లు అంచనా వేశారు. అలాగే ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సోషల్ మీడియా అకౌంట్లలో 32 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు కూడా గుర్తించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X