twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం ఆహ్వానం.. ప్రధాని మోదీతో కలిసి..

    |

    మెగాస్టార్ చిరంజీవికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భీమవరంలో భారీ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలో పాల్గొన్నాలంటూ చిరంజీవికి భారత ప్రభుత్వం ఆహ్వాన లేఖను పంపింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పంపిని ఆహ్వాన లేఖ వివరాల్లోకి వెళితే..

     గౌరవనీయులైన చిరంజీవి గారు..

    గౌరవనీయులైన చిరంజీవి గారు..

    మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 4వ తేదీ 2022 వేడుకను నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో మన్యం వీరుడుగా సుపరిచితుడు. దేశ స్వాతంత్ర్యం కోసం మద్రాస్ ప్రసిడెన్సీలోని సమాజాన్ని ఐక్యం చేసి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన సేవలను మరోసారి గుర్తు చేసుకొని నివాళి అర్పించాలని ప్రధాని నరేంద్రమోదీ భీమవరంకు వస్తున్నారు అని కిషన్ రెడ్డి తన లేఖలో తెలిపారు.

    చిరంజీవికి పంపిన లేఖలో

    చిరంజీవికి పంపిన లేఖలో


    కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భీమవరం ప్రాంతంలోని పెదమీరమ్ గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేశాం. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. జూలై 4వ తేదీన జరిగే వేడుకలో ప్రధాని మోదీ పాల్గొంటారు అని చిరంజీవికి పంపిన లేఖలో మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

     అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ

    అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ


    మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలోను, అలాగే ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభలోను మీరు పాలుపంచుకోవాలని కోరుకొంటున్నాం. ఈ వేడుకను భారత ప్రభుత్వ సాంస్కృతికశాఖ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సభను నిర్వహిస్తున్నది. జూలై 4వ తేదీ 2023 వరకు అంటే ఏడాది పొడుగున అల్లూరి సీతారామరాజు స్మారక కార్యక్రమాలను నిర్వహించడానికి ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమాలకు మీరు సంపూర్ణ సహకారం అందించాలని కోరుకొంటున్నాం. ఈ సభలో పాలుపంచుకొని విజయవంతం చేయాలని విన్నవించుకొంటున్నాం అని కిషన్ రెడ్డి తాను పంపిన లేఖలో పేర్కొన్నారు.

    English summary
    Indian Government invited Chiranjeevi to Prime Minster Narendra Modi's Programme of Alluri Sitarama Raju at Bhimavaram Which is happening on July 4th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X