Kaali poster row : 'స్మోకింగ్ కాళి' పోస్టర్‌ను తొలగించాలి.. రంగంలోకి ఇండియన్ హైకమిషన్!

ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై డాక్యుమెంటరీ 'కాళి' పోస్టర్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. జూలై 2న విడుదల చేసిన పోస్టర్‌లో 'కాళి'దేవి సిగరెట్ తాగుతూ, చేతిలో ఎల్‌జిబిటిక్యూ జెండాను పట్టుకున్నట్లు చూపబడింది. కెనడాలో నిర్వహించిన 'అండర్ ది టెన్త్' ప్రాజెక్ట్ కింద ఈ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ టొరంటోలోని అగాఖాన్ మ్యూజియంలో ప్రదర్శించబడింది. దీంతో పోస్టర్ మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీంతో ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు కెనడాలోని భారత హైకమిషన్ ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది.కెనడాలోని హిందూ సంఘాల నాయకుల నుండి మాకు ఫిర్యాదులు అందాయని ఒట్టావాలోని భారత హైకమిషన్ తెలిపింది.

ఈ సినిమా పోస్టర్ హిందూ దేవతల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని మాకు ఫిర్యాదులు అందాయని ప్రకటనలో పేర్కొన్నారు. అండర్ టెన్త్ ప్రాజెక్ట్ కింద కెనడాలో పోస్టర్ ప్రదర్శించారని ఇందులో హిందూ దేవతలను అపవిత్రం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టొరంటోలోని మా కాన్సులేట్ జనరల్ ఈఆందోళనల గురించి ఈవెంట్ నిర్వాహకులకు తెలియజేసినట్లు ప్రకటన పేర్కొంది. కెనడాలో బాధ్యులు చర్య తీసుకోవాలని కోరినట్లు మేము అనేక హిందూ సంఘాలకు కూడా తెలియజేసామని పేర్కొన్నారు. మేము కెనడియన్ అధికారులను అన్ని అభ్యంతరకరమైన విషయాలను వెంటనే తొలగించాలని కోరుతున్నామని కాన్సులేట్ అధికారులు పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేకలై పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం చెలరేగింది. పోస్టర్‌లో కాళీ దేవి వేషధారణలో ఉన్న మహిళను సిగరెట్ తాగుతూ కనిపించింది.

Indian High Commission in Canada seeks removal of smoking Kaali poster

చేతిలో త్రిశూలం, కొడవలితో ఆమె సాధారణ అలంకారాలతో పాటు, LGBTQ+ కమ్యూనిటీ యొక్క ప్రైడ్ జెండాను పట్టుకున్నట్టు చూపించారు. అయితే లీనా మణిమేకలై, తన డాక్యుమెంటరీని దూషించే ముందు దాన్ని అసలు చూడాలని ప్రజలను కోరారు. లీనా ట్వీట్ చేస్తూ- 'ఆ సాయంత్రం కాళీ కనిపించి టొరంటో వీధుల్లో తిరిగేటప్పుడు జరిగే సంఘటనల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మీరు చిత్రాన్ని చూస్తే, "అరెస్ట్ లీనా మణిమేకలై" అనే హ్యాష్‌ట్యాగ్‌ని వాడరు, అప్పుడు మీరంతా "లవ్ యు లీనా మణిమేకలై" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తారని ఆమె పేర్కొన్నారు. లీనా ఇలా క్లారిటీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం మాత్రం తగ్గడం లేదు. వివాదాస్పద పోస్టర్ కారణంగా తలెత్తిన రచ్చ తరువాత, ఇప్పుడు లీనా మణిమేకలైపై పోలీసు కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపింస్తూ లీనా మణిమేకలై వివాదాస్పద పోస్టర్‌పై ఢిల్లీకి చెందిన న్యాయవాది ఫిర్యాదు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X