ఇండియన్ ఐడల్-5 శ్రీరామ్...‘ప్రేమగీమ జాన్తా నయ్’

By Bojja Kumar

హైదరాబాద్: ఇప్పటి వరకు గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఇండియన్ ఐడల్ -5 విజేత శ్రీరామ చంద్ర మరొక అడుగు ముందుకేసి హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. నూతన నిర్మాణ సంస్థ శుభం క్రియేషన్స్ శ్రీరామచంద్ర హీరోగా 'ప్రేమ గీమ జాన్తానయ్' పేరుతో ప్రొడక్షన్ నెం.1గా ఒక చిత్రాన్ని నిర్మించబోతోంది. 'ఐ హేట్ లవ్' అనేది ఉప శీర్షిక.

దాడి బాలభాస్కర్, మద్దాల భాస్కర్ లు నిర్మిస్తున్న ఈచిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం. ఆద్యంతం నవ్వులు కురిపించే ఈ చిత్రంలో అంతర్లీనంగా యువతకు అవసరమయ్యే చక్కటి సందేశం ఉంటుంది. పూర్తి వాణిజ్య విలువల మేళవింపుతో రూపుదిద్దుకోబోయే ఈచిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉంటాయి' అన్నారు.

హీరో శ్రీరామచంద్ర మాట్లాడుతూ..హీరోగా పరిచయమవుదామనుకున్న తర్వాత అనేక కథలు వినడం జరిగింది. ఏ ఒక్క కథ కూడా నాకు నచ్చలేదు. సుబ్బు చెప్పిన ఈ కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా పరిచయ చిత్రానికి తగ్గుట్టుగా ఉన్న ఈ కథ ద్వారా నన్ను మంచి నటుడిగా నిరూపించుకోగలనన్న విశ్వాసం పూర్తిగా ఏర్పడింది. ఇదొక అద్భుతమైన చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

నిర్మాతల్లో ఒకరైన భాస్కర్ మాట్లాడుతూ 'నవంబర్ నెలలో చిత్రీకరణ మొదలు పెడతాం. విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం' అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X