బాహుబలి నెం.2..... చరిత్రలో ఆ ఘనత సాధించిన టాప్ మూవీస్ ఇవే!

By Bojja Kumar

Recommended Video

చరిత్రలో ఆ ఘనత సాధించిన టాప్ మూవీస్ !

ఇండియన్ సినీ పరిశ్రమలో రూ. 1000 కోట్ల కలెక్షన్ మార్కు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు దంగల్', 'బాహుబలి' చిత్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇక రూ. 500 మార్కు అందుకున్న చిత్రాలు ఇప్పటి వరకు 8 మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో మరొక చిత్రం చేరింది. జైరా వాసిమ్ ప్రధాన పాత్రలో, అమీర్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించిన 'సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రం తాజాగా రూ. 500 మార్కును అందుకుంది. ఇండియన్ సినీ చరిత్రలో రూ. 500 కోట్ల మార్కును అందుకున్న చిత్రాలు, ఓవరాల్ వసూళ్లపై ఓ లుక్కేయండి.

నెం.1 ‘దంగల్'

నెం.1 ‘దంగల్'

అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్' చిత్రం ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా ఉంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2122.3 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించారు.

 బాహుబలి 2

బాహుబలి 2

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బాహుబలి-2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,708.49 వసూలు చేసింది. ఇండియాలో రూ. 1000 కోట్ల మార్కును అందుకున్న తొలి చిత్రం కూడా ఇదే.

నెం.3 ‘పికె'

నెం.3 ‘పికె'

ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 500 కోట్ల మార్కును దాటిన చిత్రంల్లో అమీర్ ఖాన్ ‘పికె' ఒకటి. ఇక ఓవరాల్ వసూళ్ల పరంగా ఈ చిత్రం రూ. 854 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో ఉంది.

బాహుబలి-ది బిగినింగ్

బాహుబలి-ది బిగినింగ్

బాహుబలి- ది బిగినింగ్ చిత్రం ఓవరాల్ వసూళ్ల పరంగా 4వ స్థానంలో ఉంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లు వసూలు చేసింది.

 భజరంగీ భాయిజాన్

భజరంగీ భాయిజాన్

సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘భజరంగీ భాయి జాన్' చిత్రం వరల్డ్ వైడ్ రూ. 630.86 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ వసూళ్ల పరంగా ఈ చిత్రం టాప్-5లో ఉంది.

 సుల్తాన్

సుల్తాన్

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘సుల్తాన్' చిత్రం రూ.589.25 వసూలు చేసింది. ఈ చిత్రం ఓవరాల్ వసూళ్ల పరంగా 6వ స్థానంలో ఉంది.

ధూమ్ 3

ధూమ్ 3

అమీర్ ఖాన్ నటించిన మరో చిత్రం ‘ధూమ్-3' వసూళ్ల పరంగా టాప్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 589.2 వసూలు చేసి 7వ స్థానంలో ఉంది.

 టైగర్ జిందా హై

టైగర్ జిందా హై

ఈ ఏడాది విడుదలైన ‘టైగర్ జిందాహై' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ల సాధించి రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రం రూ. 552 వసూలు చేసింది.

 సీక్రెట్ సూపర్ స్టార్

సీక్రెట్ సూపర్ స్టార్

జైరా వాసిమ్ ప్రధాన పాత్రలో, అమీర్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రం తాజాగా రూ. 500 మార్కును అందుకుంది. ఈ చిత్రం ఓవరాల్ వసూళ్లు రూ. 534.15 కోట్లు. ఈచిత్రం కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X