బ్రిటీష్ సింగర్‌తో ప్రేమలో పడ్డ హార్ధిక్ పాండ్యా.. రెడ్ హ్యాండెడ్‌గా వెకేషన్స్‌లో దొరికిన ప్రేమజంట
వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా ముద్దాడటం వెనుక కీలకపాత్ర పోషించారు హార్డిక్ పాండ్యా. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు చాలా రోజుల తర్వాత ఓ మెగా ఐసీసీ ట్రోఫీని గెలవడానికి కారణమయ్యాడు. 150 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు, 11 వికెట్లు పడగొట్టాడు పాండ్యా. విజయం సాధించిన వెంటనే మైదానంలో చిన్న పిల్లాడిలా ఏడ్చాడు పాండ్యా. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్డిక్.. చెత్త ప్రదర్శన చేయడమే గాక, సారథిగానూ ఫెయిల్ అయ్యాడు. గ్రౌండ్‌లో అతనిని హేళన చేసేవారు ముంబై , రోహిత్ ఫ్యాన్స్. అయినప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో టీ20 ప్రపంచకప్‌లో కసితీరా ఆడి జట్టును విశ్వవిజేతగా నిలబెట్టాడు. వరల్డ్ కప్ సాధించి తొలిసారిగా వడోదరలో అడుగుపెట్టిన పాండ్యాకు అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు.
అయితే ప్రపంచకప్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న వేళ పాండ్యా షాకిచ్చే న్యూస్ చెప్పాడు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లుగా బాంబు పేల్చాడు. కలిసి జీవించడానికి అవకాశాలను వెతికామని.. కానీ చివరికి కఠిన నిర్ణయం వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని ఇన్‌స్టాలో వెల్లడించాడు. నటాషా కూడా విడాకుల వార్తను తన ధ్రువీకరిస్తూ పోస్ట్ పెట్టింది. విడిపోయినప్పటికీ తమ బిడ్డ అగస్త్యకు కో - పేరెంట్స్‌గా ఉంటామని పాండ్యా వెల్లడించాడు.

సెర్బియాకు చెందని నటాషా 2013లో హిందీ సినిమా సత్యాగ్రహం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హిందీ బిగ్‌బాస్-8తో ప్రేక్షకులకు మరింత దగ్గరై పలు సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసింది. ఈ సమయంలో హార్డిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చగా.. 2020లో పాండ్యా - నటాషాల పెళ్లి జరిగింది. కొంతకాలం వీరి వైవాహిక జీవితం సజావుగా సాగగా.. తర్వాత మాత్రం విభేదాలు తలెత్తాయి. నటాషా తన ఇన్‌స్టా ఖాతాలో పాండ్యా ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ జంట విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. విడాకుల తర్వాత తన బిడ్డ అగస్త్యను తీసుకుని తన స్వదేశం వెళ్లిపోయింది.
నటాషాతో విడాకుల తర్వాత పాండ్యా మరో పెళ్లి చేసుకుంటారా.. లేక జీవితాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాడా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ సెలబ్రెటీతో పాండ్యా క్లోజ్‌గా ఉన్నాడని.. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. బ్రిటీష్ సింగర్, బుల్లితెర నటి జాస్మిన్ వాలియాతో కలిసి ఆయన చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడన్నది ఆ వార్త. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియోను పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కొద్దిరోజుల క్రితం అదే ప్రదేశంలో తీసుకున్న వీడియోను వాలియా సైతం పోస్ట్ చేయడం... ఒకరి పోస్ట్‌ను మరొకరు లైక్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే పుకార్లు గుప్పుమన్నాయి.
ఇంగ్లాండ్‌కు వలస వెళ్లిన భారతీయ తల్లిదండ్రులకు ఎసెక్స్‌లో జన్మించారు జాస్మిన్ వాలియా. టీవీలు, పలు రియాలిటీ షోలలో పాల్గొని అభిమానులకు చేరువైన ఆమె.. 2014లో సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి పలు ఆల్బమ్‌లు విడుదల చేసింది. జాస్మిన్‌కు 6.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఆలపించిన బామ్ డిగీ పాటను ఓ హిందీ చిత్రంలో రీమేక్ చేశారు. ఎప్పటి నుంచో జాస్మిన్ పెడుతున్న పోస్ట్‌లకు హార్డిక్ పాండ్యా కామెంట్లు చేస్తున్నాడు. రేపో, మాపో తమ రిలేషన్‌పై వీరిద్దరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











