ఆ..సినీ నిర్మాతలకు రైల్వేశాఖ నోటీసులు
షాహిద్ కపూర్, సోనమ్ కపూర్ జంటగా పంకజ్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ మౌసం. ఈ సినిమా నిర్మాతలకు భారత రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. వారం క్రితం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారితో వచ్చిన సమస్యను పరిష్కరించుకున్న ఫిల్మ్ మేకర్స్...తాజాగా రైల్వే శాఖ నుంచి ఇబ్బందులు ఎదుర్కొనడం గమనార్హం. అసలు రైల్వే శాఖ వీరికి నోటీసులు పంపడానికి కారణం ఏమిటంటే, ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్ ప్రమాదకరమైన రైల్వే క్రాసింగ్ స్టంట్ చేశాడు. దీనిపై సీరియస్ గా స్పందించిన రైల్వే బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక పోతో మౌసం సినిమా రేపు(సెప్టెంబర్ 23)న విడుదలకు సిద్ధం అవుతోంది. కాశ్మీరీ అమ్మాయికి, సిక్కు అబ్బాయికి మధ్య 1970 దశకంలో జరిగే హృద్యమైన ప్రేమకథగా 'మౌసమ్" చిత్రం తెరకెక్కింది. చాలా కాలంగా పెద్ద హిట్లు లేని షాహిద్- సోనమ్ కపూర్ ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య ముద్దుసీన్లు కూడా ఉన్నారు. ఏది ఏమైతేనేం...ఇలాంటి వివాదాలు సినిమాకు మరింత ప్రచారాన్ని తెచ్చి పెడుతున్నాయి.


Click it and Unblock the Notifications











