ఒకే వేదికపైకి ఇండియన్ సూపర్ స్టార్స్.. అమితాబ్ కోరడంతో సై అన్న చిరంజీవి!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా దెబ్బకు అమెరికా, ఇటలీ వంటి దేశాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మనదేశంలోనూ కరోనా శర వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికి కరోనా సోకిన వారి సంఖ్య దాదాపుగా నాలుగు వేలకు చేరుకుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
Recommended Video

కరోనా కట్టడికి చర్యలు..
భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తుండగా.. దాని కట్టడికి ప్రభుత్వాలు అనేక చర్యలను చేపడుతోంది. అయితే విరుగుడే లేని వైరస్.. చెలరేగిపోతోంది. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించినా.. పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది.

కరోనాపై అవగాహన..
కరోనా వైరస్ పట్ల ప్రజలందరికీ అవగాహన కలిగించేందకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సినీ తారలంతా తమ అభిమానులకు, ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వీడియో సందేశాలను విడుదల చేస్తూ కరోనా గురించి విపులంగా వివరించి చెబుతున్నారు.

పాటలతో వస్తోన్న తారలు..
కరోనా వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు కొత్త పద్దతిని ఎంచుకున్నారు. పాటల రూపంలో కరోనా గురించి చెబుతూ అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే కోటి స్వరపరిచిన పాటలో చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ నటించారు. ఈ వీడియోను ప్రధాని సైతం అభినందించిన సంగతి తెలిసిందే.

ఇండియన్ సూపర్ స్టార్స్ అంతా..
ఈ మేరకు కరోనా పట్ల దేశ ప్రజలందరికీ అవగాహన కలిగించేందుకు ఇండియన సూపర్ స్టార్స్ అంతా ఒకే వేదికపైకి రానున్నారు. ఈ మేరకు బిగ్ బీ అమితాబ్ చిరును కూడా భాగస్వామి కావాలని కోరాడట. అమితాబ్ అడగడంతో చిరు కూడా నటించేశాడట. మరి ఆ వీడియో ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











