twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ స్క్రీన్‌పై గ్రేటెస్ట్ మల్టీస్టారర్.. బిగ్‌బీ, చిరు, రజనీ, మమ్ముట్టి, మోహనలాల్, ఆలియా..

    |

    ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ స్తంభించింది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలోనే లెజెండ్స్ అంతా ఇంటికే పరిమితం అయ్యారు. కరోనావైరస్ చైన్‌ను కట్ చేయడానికి అందరూ ఇంటికే పరిమితం కావాలని తమ అభిమానులకు సూచించారు. అంతేకాకుండా కరోనా కాటుకు బలవుతున్న కార్మికులకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. తాజాగా ఇంట్లోనే ఉంటూ ఇండియన్ స్క్రీన్‌పై కొత్త ప్రయోగానికి తెర తీశారు..అదేమిటంటే..

     భాషలు వేరైనా...

    భాషలు వేరైనా...

    భాషలు వేరైనా సినీ పరిశ్రమ ఒక్కటే.. అందులో పనిచేసే ప్రతీ కళాకారులందరూ ఒక్కటే అనే నినాదాన్ని అమితాబ్ బచ్చన్ ముందుకు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది సినీ వేతన కార్మికులందరికీ అండగా నిలువాలని బిగ్ బీ పిలుపునిచ్చారు. ఆ క్రమంలోనే మేమంత ఒక్కటే అనే విధంగా అద్బుతమైన షార్ట్ ఫిలింను రూపొందించారు.

     అన్ని భాషల నటులంతా

    అన్ని భాషల నటులంతా

    సోని పిక్చర్స్, కల్యాణ్ జ్యువెలర్స్ రూపొందించిన షార్ట్ ఫిలింలో అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ లాంటి సూపర్‌స్టార్స్‌తోపాటు బాలీవుడ్‌కు చెందిన రణ్‌బీర్, ఆలియా, దల్జిత్ దోసాంజ్, ప్రియాంక చోప్రా తదితరులు నటించారు.

    నల్లకళ్లజోడుపై కథ

    నల్లకళ్లజోడుపై కథ

    దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్ర, యువ నటులంతా చెరో చేయి వేశారు. పక్కాగా రూపొందించిన స్క్రిప్టును స్థానికంగా ఉంటే కళాకారులతో రూపొందించారు. కేవలం అమితాబ్ కళ్లజోడుపై సాగే ఈ షార్ట్ ఫిలింలో చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, అమితాబ్ తమ మార్క్ చూపించారు.

    చిరంజీవి, రజనీ, మోహన్‌లాల్, మమ్ముట్టి

    చిరంజీవి, రజనీ, మోహన్‌లాల్, మమ్ముట్టి

    నల్ల కళ్లజోడు గురించి వెతికే కథలో రణ్‌బీర్, దల్జిత్, మమ్ముట్టి, మోహన్ లాల్, రజనీకాంత్, తమ వంతు పాత్రలను పోషించారు. బాత్రూంలో నీళ్లే రావడం లేదు. కళ్లజోడు ఎక్కడ నుంచి వస్తుంది అంటూ చిరు సెటైర్ వేశారు. రజనీకాంత్ తన స్టైయిల్లో కళ్లజోడును మ్యాజిక్ చేయడం ఆకట్టుకొనే అంశాలు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాం. సన్ గ్లాసెస్ ఎక్కడ పోతాయో అనే బెంగతో నేను వెతుకుతున్నాను. లాక్ డౌన్ తర్వాత దొరకవనే కారణంతోనే అడిగాను అని బిగ్‌బీ ఫన్‌గా సమాధానం ఇవ్వడంతో షార్ట్ ఫిలిం ముగుస్తుంది.

     సినీ కళాకారులంతా ఒకటే కుటుంబం

    సినీ కళాకారులంతా ఒకటే కుటుంబం

    షార్ట్ ఫిలిం రూపకల్పన వెనుక గొప్ప సందేశం ఉంది. సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ కళాకారులందరూ ఒక్కటే. ఒక్కటే కుటుంబం. మా వెనుక పనిచేసే కార్మికులు ప్రస్తుతం కరోనా కారణంగా సంకట స్థితిలో పడ్డారు. వారిని ఆదుకొనే బాధ్యత మాపై ఉంది. వారికి అండగా నిలిచేందుకు పలు కార్యక్రమాల ద్వారా మేము డబ్బును పోగు చేశాం. ఇలాంటి సమయంలో భయపడొద్దు.. ధైర్యంగా ఉండటమే ముఖ్యం. సురక్షణ కోసం ఇంటి పట్టునే ఉండండి అంటూ అమితాబ్ ఓ సందేశాన్ని ఇచ్చారు.

    Recommended Video

    Ajay Devgn Look From RRR On His birthday, Missed Due To Lockdown

    English summary
    Indian Superstars like Amitabh Bachchan, Chirajneevi, Mohan Lal acted in Short film. They have given message that we are one.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X