విజయవాడలో టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్
భారత క్రికెట్ జట్టుకు, టాలీవుడ్ జట్టుకు మధ్య మరో బెనిఫిట్ మ్యాచ్ జరుగనుంది. విజయవాడలోని గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జూన్ 11న జరుగనుంది. టాలీవుడ్ జట్టుకు వెంకటేష్, భారతజట్టుకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజరుద్దీన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. టాలీవుడ్ టీంలో ఇంకా శ్రీకాంత్, తరుణ్, ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ తదితరులు ఆడబోతున్నారు. అజరుద్దీన్ జట్టులో హేమంత్ బదానీ, ఎల్ బాలాజీ, ఎంఎస్‌కె ప్రసాద్, మురళీ కార్తీక్ ఆడుతారు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార హక్కులను జీ తెలుగు ఛానల్ చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవాకార్యక్రమాలకు వినియోగించనున్నారు.


Click it and Unblock the Notifications