ఏఆర్ రెహమాన్ కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.. ఏమైందంటే?

ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. దాంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించినట్టు సమాచారం. అయితే ఏ ఆర్ రెహమాన్ గురించి ఈ ఆందోళనకరమైన వార్త ఇండస్ట్రీలో వ్యాప్తి చెందింది. రెహమాన్ తీవ్ర అస్వస్థతతో అస్పత్రిపాలయ్యారంటూ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలోను తెగ వైరల్ కావడంతో అభిమానులు ఎంతగానో కంగారు పడ్డారు. రెహ్మాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అంటూ చింతిస్తున్నారు. ఇక దీనిపై తాజాగా అప్డేట్ అందింది.

రెహమాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపినట్టు సమాచారం. అయితే రెహమాన్ రీసెంట్ గా లండన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా లొకేషన్ కు రీచ్ కాగానే కొంచెం నీరసంగా ఫీలయ్యారు. అదే విషయాన్ని తన పర్సనల్ టీమ్ లోని ఒకరికి రెహమాన్ తెలియజేశారు. దాంతో వెంటనే వాళ్ళు అప్రమత్తమై చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కూడా అందించారు. అయితే ఈ ఘటన మొత్తం మార్చి 15 శనివారం సాయంత్రం జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు మార్చి 16 ఆదివారం ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయినట్టు తన పర్సనల్ టీం తెలియజేసింది.

India s Top Music Director AR Rahman Hospitalised what was happened to him

అయితే, ఏఆర్ రెహమాన్ హాస్పిటల్ లో చేరడంపై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆందోళన చెందారు. అసలు ఆయనకి ఏం జరిగిందంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ప్రేమను చాతిలో తీవ్రమైన నొప్పి రావడంతోనే ఆసుపత్రికి తరలించారు అంటూ సమాచారం వ్యాప్తి చెందింది. ఇక ఈ విషయమై తాజాగా రెహమాన్ చెల్లెలు రిహానా స్పందించింది. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అప్డేట్ ఇచ్చింది. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఇంటికి చేరుకున్నారని కూడా రిహానా తెలియజేసింది.

లండన్ నుంచి ఏఆర్ రెహమాన్ తిరుగు ప్రయాణానికి ముందు ఎక్కువగా వాటర్ తీసుకోలేదని, దాంతో డిహైడ్రేషన్ కు గురయ్యారని తెలిపింది. ఎలాంటి ఛాతి నొప్పి లేదని, డిహైడ్రేషన్ వల్లనే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారని తెలియజేసింది. శనివారం ఆస్పత్రిలో జాయిన్ కాగా ఆదివారం ఉదయం డిశ్చార్జ్ చేశారని చెప్పింది. అయితే రెహమాన్ కు ఏం జరగలేదని రిహానా స్పష్టం చెప్పింది. డిహైడ్రేషన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే మెడలో కొంత పెయిన్ వచ్చి ఆసుపత్రికి వెళ్లారని చెప్పింది. పరీక్షించిన డాక్టర్లు రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నాడని ధ్రువీకరించినట్లు ఆయన మేనేజర్ సెంథిల్ విలన్ తెలిపారు.

ఇక ఏఆర్ రెహమాన్ ఇండియాలో ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారో అందరికి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి అన్ని భాషల్లో ఏ ఆర్ రెహమాన్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ను అందించిన సంగతి తెలిసిందే. ఆయన సంగీతానికి ప్రేక్షకులు ఫిదా కావడంతో పాటు ఎంతోమంది ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సంగీత రంగంలో రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ rc16 కు సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ar rahman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X