Indira Devi Death: కృష్ణ, మహేశ్ బాబుకు చిరంజీవి పరామర్శ.. స్వయంగా వెళ్లి ఓదార్పు.. ఫోటో వైరల్

టాలీవుడ్ లో ఏ సమస్య వచ్చిన ముందుండి దాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు మెగాస్టార్ చిరంజీవి. తాను ఇండస్ట్రీకి పెద్ద కాదు.. పెద్ద కొడుకుగా ఉంటాను అని అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకు తగినట్లుగానే అనేక సార్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా వ్యవహరించారు. తెలుగు చిత్రసీమలో ఎవరికీ ఏ కష్టమొచ్చినా, సమస్య వచ్చిన ఆదుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి.

బుధవారం సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన చిరంజీవి తాజాగా ఘట్టమనేని కుటుంబాన్ని పర్సనల్ గా కలిసి పరామర్శించారు.
వరుస విషాదాలు..

చిత్రసీమలో వరుసగా విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మాతృవియోగం కలిగింది. దీంతో ఘట్టమననేని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందిరా దేవి మరణం సినీ ప్రముఖులనే కాకుండా యావత్ తెలుగు ప్రజలను కలిచివేసింది.

సోషల్ మీడియా వేదికగా..

సోషల్ మీడియా వేదికగా..

ఇందిరా దేవి మరణవార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఘట్టమనేని కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని..

మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని..

''శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను'' అని ట్విటర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి రాసుకొచ్చారు.

పర్సనల్ గా కలిసి..

పర్సనల్ గా కలిసి..

తాజాగా ఘట్టమనేని కుటుంబాన్ని పర్సనల్ గా కలిసిన మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబును, కృష్ణను ఓదార్చారు. ఘట్టమనేని కుటంబాన్ని పర్సనల్ గా కలిసిన చిరంజీవి సానుభూతి తెలిపారు. ఇందిరా దేవి మరణంపై పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కార్యక్రమానికి ఆలస్యంగా..

కార్యక్రమానికి ఆలస్యంగా..

ఇదిలా ఉంటే చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవి కాస్త ఆలస్యంగా హాజరయ్యారు. కాగా మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణంపై అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

మనో ధైర్యాన్ని ప్రసాదించాలని..

మనో ధైర్యాన్ని ప్రసాదించాలని..

''ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను'' అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు.

ఇందిరా దేవి గారి మరణం బాధాకరం..

ఇందిరా దేవి గారి మరణం బాధాకరం..

''ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి గారి మరణం బాధాకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరా దేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని నందమూరి బాలకృష్ణ రాసుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X