For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Indira Devi Death:అమ్మంటే దేవుడితో సమానం.. మహేశ్ బాబు ఎమోషనల్ వర్డ్స్.. వెక్కి వెక్కి ఏడ్చిన సితార..

  |

  సూపర్ స్టార్ కష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలోనే బుధవారం (సెప్టెంబర్ 28) ఉదయం ఇందిరా దేవి కన్నుమూశారు.

  దీంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు, పెద్దలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక తన తల్లి గురించి మహేశ్ బాబు ఎమోషనల్ గా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  టాలీవుడ్ దిగ్భ్రాంతి..

  టాలీవుడ్ దిగ్భ్రాంతి..

  టాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ప్రభాస్ పెద్దనాన్ని కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త మరవకముందే తెలుగు చిత్రసీమలో మరో విషాదం అలుముకుంది. సూపర్ స్టార్ కష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త విని టాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనయింది.

  విడదీయలేని అనుబంధం

  విడదీయలేని అనుబంధం

  సినీ పెద్దలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇందిరా దేవి కుమార్తె, మహేశ్ బాబు సోదరి మంజుల ఇప్పటికే తన తల్లి గొప్పదనం గురించి చెబుతూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తన తల్లి ఇందిరా దేవితో విడదీయలేని అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో ఆమె గురించి చాలా సార్లు ఎమోషనల్ గా చెప్పాడు.

  అమ్మంటే దేవుడితో సమానం..

  అమ్మంటే దేవుడితో సమానం..

  ప్రస్తుతం ఈ మాటలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ''నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ.. సినిమా విడుదలకు ముందు అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం. అందుకే నాకు ఈ సక్సెస్ వచ్చింది. ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలన్ని అందరి తల్లులకు అంకితం ఇస్తున్నాను'' అని ఎమోషనల్ గా మహేశ్ బాబు తెలిపాడు.

  ఈ నిజంతోనే జీవితాంతం బతకాలి..

  అలాగే మహేశ్ బాబు చాలా వరకు తల్లి సెంటిమెంట్ ఉన్న చిత్రాలు చేశారు. అందులో నాని, వన్ నేనొక్కడినే సినిమాలు ఉన్నాయి. వన్ నేనొక్కడినే సినిమాలో ఓ బాలుడికి తల్లి చనిపోయిందంటూ చెప్పే సీన్ ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'మీ అమ్మ చనిపోయింది. ఈ నిజంతోనే నువ్వు జీవితాంతం బతకాలి. ఇక నుంచి నువ్ అమ్మ లేకుండా ఆడుకోవాలి. అమ్మ లేకుండా తినాలి. అమ్మ లేకుండా పెరగాలి. అమ్మ లేకుండా పడుకోవాలి. అన్ని అమ్మ లేకుండానే..' అంటూ ఉండే ఈ వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది.

  వెక్కి వెక్కి ఏడ్చిన సితార

  వెక్కి వెక్కి ఏడ్చిన సితార

  మహేశ్ బాబు సితార కూడా తన నానమ్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇందిరా దేవి పార్థివ దేహం ముందు కూర్చొని వెక్కి వెక్కి సితార ఏడుస్తుంటే మహేశ్ బాబు ఓదారుస్తున్నారు. నానమ్మతో సితారకు మంచి అటాచ్ మెంట్ ఉందట. సితార తరచూ నానమ్మ ఇంటికి వెళ్తూ ఉండేదట.

  ఇందిరా దేవి అంత్యక్రియలు..

  ఇందిరా దేవి అంత్యక్రియలు..

  ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్యాం 12 గంటల వరకు ఆమె పార్థివ దేహాన్న ఉంచనున్నారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య. వీరిద్దరకీ 1961లో వివాహం జరగ్గా ఐదుగురు సంతానం. 1969లో విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.

  English summary
  Super Star Krishna Wife And Mahesh Babu Mother Indira Devi Passed Away. Mahesh Babu Emotional Words About Her Mother And Sitara Crying Videos Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X