For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

  |

  తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణంతో టాలీవుడ్‌లో దిగ్బ్రాంతికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆమె మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా దేవి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం పదండి!

  అనారోగ్యంతో ఇందిరా కన్నుమూత

  అనారోగ్యంతో ఇందిరా కన్నుమూత

  టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పతికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు ఆమెకు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంట్లో ఇందిర తుదిశ్వాస విడిచారు.

  స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మక రాజశేఖర్: మైండ్‌బ్లాక్ చేసే ఫోజులతో రచ్చ

  ఇందిరా దేవికి వాళ్లంతా సంతాపం

  ఇందిరా దేవికి వాళ్లంతా సంతాపం

  సూపర్ స్టార్ కృష్ణ భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆమె మరణంపై ఘట్టమనేని ఫ్యామిలీ అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. దీంతో ఇందిరా దేవి పేరు ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

  హీరో కృష్ణతో ఇందిరా దేవి వివాహం

  హీరో కృష్ణతో ఇందిరా దేవి వివాహం

  నటన మీద ఉన్న మక్కువతో కృష్ణ డిగ్రీ పూర్తైన వెంటనే మద్రాసు వెళ్లారు. అక్కడ అవకాశాల కోసం వేచి చూస్తోన్న సమయంలోనే.. అంటే 1965లో 'తేనే మనసులు' అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఇక, ఆ సంవత్సరమే నవంబర్‌లో కృష్ణ.. ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

  NTR University: జగన్, రాజశేఖర్‌ రెడ్డిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆ జంతువులతో పోలుస్తూ ఘాటుగా!

  విజయ నిర్మలతో కృష్ణ రెండో పెళ్లి

  విజయ నిర్మలతో కృష్ణ రెండో పెళ్లి

  సూపర్ స్టార్ కృష్ణతో ఇందిరా దేవికి వివాహం జరిగిన తర్వాత వీళ్ల వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే ఈ జంటకు రమేష్ బాబు, పద్మావతి జన్మించారు. ఆ సమయంలోనే కృష్ణ, తోటి నటి విజయ నిర్మలతో చాలా కాలం పాటు సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలా 1969లో ఆమెను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది.

  పెళ్లైనా భర్తతోనే ఉంటానని చెప్పి

  పెళ్లైనా భర్తతోనే ఉంటానని చెప్పి

  1969లో విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఈ విషయాన్ని నేరుగా తన భార్య ఇందిరా దేవికి చెప్పారట. మొదట్లో దీనిపై చాలా బాధపడిన ఆమె.. ఆ తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తేల్చి చెప్పేశారని తెలిసింది. ఇక, రెండో పెళ్లి అయినా భర్తతోనే కలిసి ఉంటానని సూటిగా చెప్పారంట. దీంతో కృష్ణ ఇద్దరు భార్యలతోనూ కలిసి ఉండేవారట.

  Bigg Boss Vote: 4వ వారం షాకింగ్ ఓటింగ్.. ఒక్క ఎపిసోడ్‌కే ఆమె సంచలనం.. ఆ జంటకు మాత్రం బిగ్ షాక్

  మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి

  మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి

  సూపర్ స్టార్ కృష్ణ.. విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇందిరా దేవితో ఎక్కువగా కలిసి ఉండేవారు. ఈ క్రమంలోనే ఈ జంటకు మంజుల, మహేశ్ బాబు, ప్రియదర్శినిలు జన్మించారు. దీంతో ఇందిరా తన పిల్లలతోనే కలిసి ఉండేవారు. కానీ, కృష్ణ మాత్రం విజయ నిర్మలతోనే ఎక్కువగా ఉండేవారని టాక్ ఉంది. ఆ తర్వాత ఆమెతోనే కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు.

  మొన్నటి పుట్టినరోజున జంటగానే

  మొన్నటి పుట్టినరోజున జంటగానే

  విజయ నిర్మలతోనే కలిసి ఉన్న సూపర్ స్టార్ కృష్ణ.. తన మొదటి భార్య ఇందిరా దేవిని కూడా అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవారు. మరీ ముఖ్యంగా ఆమె పుట్టినరోజు (ఏప్రిల్ 20)న మాత్రం కచ్చితంగా హాజరై కేక్ కట్ చేయించేవారు. ఇలా 2022న కూడా వీళ్లిద్దరూ జంటగానే కనిపించారు. ఇక, ఇప్పుడు ఇందిరా మరణంతో కృష్ణ విషాదంలో మునిగిపోయారనే చెప్పాలి.

  English summary
  Mahesh Babu's Mother Ghattamaneni Indira Devi passed away on Wednesday Due to Health problems. Let We Know about her Life Story.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X