మోహన్ బాబు వ్యాఖ్యలు...చిరంజీవికి అంత సీన్ లేదా?

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మెగా స్టార్‌గా ప్రఖ్యాతిగాంచిన చిరంజీవి, కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు మధ్య చాలా ఏళ్ల నుంచి మనస్పర్థలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఒకరంటే ఒకరికి అస్సలు పడదని అనేక సందర్భాల్లో రుజువైంది కూడా. పలు సినిమా వేదికలపైన, మీడియా ఇంటర్య్వూల్లో కూడా ఈ విషయం తేటతెల్లమైంది.

నటనలో ఆరితేరిన వీరిద్దరూ.....తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు, ఇద్దరూ స్నేహితుల్లా కలిసి ఉంటాం అంటూ జనాలను నమ్మించే ప్రయత్నం కూడా చేసారు. వీరి మధ్య ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తుందని తాజాగా మరోసారి రుజువైంది. తాజాగా టీవీ ఛానల్ ఇంటర్య్యూలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

'ఒక్క సినిమా హిట్టయితే ముఖ్యమంతి...ఏంటండీ ముఖ్యమంత్రి, అందరికీ సాధ్యాం కాదు' అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. మోహన్ బాబు వ్యాఖ్యలు పరోక్షంగా చిరంజీవిపైనే అనే వాదన వినిపిస్తోంది. చిరంజీవిది సీనియర్ ఎన్టీఆర్ స్థాయి కాదని ఆయన చెప్పకనే చెప్పారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇక సినిమా విషయాల గురించి మాట్లాడుతూ...నేను దర్శకుడిని అయితే రోజుకొకరిని కొడతాను. ఆ స్థానంలో ఇమడలేను. ఇటీవల చాలామంది నటులు రోజువారీ కూలీలు అయ్యారు. ఇదివరకు ఓ సినిమాకి చొప్పున ఇంత పారితోషికం అని తీసుకునేవారు. ఇప్పుడు రోజుకింత అని అడుగుతున్నారు. అది కూడా చెప్పిన సమయానికి సెట్‌కి రారు. వచ్చిందే ఆలస్యం... మళ్లీ సెల్‌ఫోన్లలో మాట్లాడుకుంటూ కాలం గడుపుతుంటారు అన్నారు.

అలాగే ఇంకొంతమందేమో స్వర్గంలో నుంచి వూడిపడినట్టు చేస్తుంటారు. నేను దర్శకుడిని అయితే అలాంటివి అస్సలు క్షమించను. ఇప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో కాస్త గట్టిగా అడిగితే... 'మోహన్‌బాబు కంపెనీలో ఎందుకు చేయాలండీ?' అంటారు. నటీనటులు ఎప్పుడు సెట్‌కి వచ్చినా ఏమీ అనకుండా ఉండేవాళ్లు నా దృష్టిలో థర్డ్‌ గ్రేడ్‌ దర్శకులు, నిర్మాతలు. నాన్నగారు చెప్పినట్టు పరుషంగా మాట్లాడకుండా మాత్రం ఉండలేకపోయా. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే పరిస్థితులు ఇప్పుడు లేవు. రోజురోజుకీ విలువలు దిగజారిపోతున్నాయి అన్నారు.

ఇక ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. దాన్ని ఆవేశం అంటారో, ముక్కోపితనం అంటారో ఇంకేమనుకొంటారో నాకు తెలియదు. నా దృష్టిలో ఆవేశపరుడిగా ఉన్నా ఫర్లేదు గానీ అవినీతి పరుడిగా మాత్రం ఉండకూడదు. సమయం సందర్భం వచ్చినప్పుడే ఆవేశపడతాను. నా ఆవేశం, నా కోపం నాకే చెడు చేసింది తప్ప మరెవ్వరికీ ఇబ్బంది కలిగించలేదు. లోపల ఏదో పెట్టుకొని బయటికి ఇంకేదో మాట్లాడటం నాకు మొదట్నుంచీ అలవాటు లేదు. ఆరోగ్యానికి కూడా అది మంచిది కాదని నా నమ్మకం అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X