ఇంద్రగంటి మోహన్ కృష్ణ కొత్త చిత్రానికి హాలీవుడ్ ప్రేరణ

By Srikanya

Antaku Mundu Aa Tarvatha
హైదరాబాద్: 'అష్టా చెమ్మ' చిత్రంతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాజాగా 'అంతకు ముందు... ఆ తరువాత' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సుమంత్ అశ్విన్ హీరోగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'Seven' అనే హాలీవుడ్ చిత్రం నుంచి ప్రేరణ పొంది రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.ఇక ఈ చిత్రం కాన్సెప్టు టైటిల్ ని జస్టిఫై చేస్తుందని, నవతరం ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ.... ప్రేమలో గెలవడం ఒక ఎత్తయితే... ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. జీవితాంతం తోడుగా ఉంటాననే భరోసాని ఎదుటి వ్యక్తిలో కల్పించినప్పుడే అది నిలబడుతుంది. నవతరం ఆ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తున్నారు? వారిలో ఉన్న చిన్నపాటి గందరగోళానికి కారణమేమిటి? ఓ జంట ప్రేమలో పడటానికి ముందు ఎలా ఉంటుంది?, ఆ తర్వాత ఎలా మారిపోతుంటుంది? అనే విషయాల్ని మా చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో యువతరం ఆలోచనలు ఏ రీతిన ఉంటున్నాయో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో రవిబాబు, రావు రమేష్‌, అవసరాల శ్రీనివాస్‌, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.విందా, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఎస్‌.రవీందర్‌, సంగీతం: కల్యాణి కోడూరి, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్‌రెడ్డి వి., కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X