ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అంటూ ట్రోల్స్.. ఇంద్రనీల్ ఎమోషనల్ కామెంట్స్
బుల్లితెరపై కొన్ని జంటలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. సీరియల్, సినిమాల్లో కలిసి నటించిన వారే నిజ జీవితంలోనూ ఒక్కటవుతుంటారు. అయితే తెలుగు బుల్లితెరపై ఓ ఊపు ఊపిన ధారావాహిక చక్రవాకం. ఈ సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. అలా ఈ సీరియల్‌లో ఇంద్రనీల్, మేఘన పాత్రలు బాగానే క్లిక్ అయ్యాయి. ఆ సీరియల్ అత్తా, అల్లుళ్లుగా ఈ జంట నటించింది. కానీ ఆ తరువాత రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారారు.

అత్తాఅల్లుళ్లుగా..
సీరియల్‌లో అత్తా అల్లుళ్లుగా నటించిన ఇంద్రనీల్, మేఘనలు రియల్ లైఫ్‌లో ఇలా పెళ్లి చేసుకోవడం విపరీతమైన నెగెటివ్ కామెంట్స్, నీలాపనిందలు, అవమానాలు ఎదురయ్యాయట. ఆ సమయంలో చాలా మంది ఆ వివాహాంపై పెదవి విరిచారట. తాజాగా ఈ విషయాలన్నీ ఇంద్రనీల్ చెప్పుకొంటూ ఎమోషనల్ అయ్యాడు.
క్యాథరీన్ త్రెసా బ్యూటీఫుల్ గ్యాలరీ.. లేటేస్ట్ ఫోటోలు వైరల్

ఆ మధ్య అలా..
ఇంద్రనీల్, మేఘన ఇద్దరూ కలిసి స్టార్ మాలో ఎన్నోషోల్లో పాల్గొన్నారు. ఆ మధ్య వచ్చిన డ్యాన్స్ షోలో ఈఇద్దరూ జంటగా పాల్గొని డ్యాన్సులతో దుమ్ములేపారు. నీతోనే డ్యాన్స్ అనే షోలో ఇంద్రనీల్, మేఘనలు డ్యాన్స్‌లు, తమ మధ్య ఉన్న ప్రేమను బయట పెడుతూ జనాలకు మరింత దగ్గరయ్యారు.

రీసెంట్‌గా ఇలా..
డ్యాన్స్ ప్లస్ షోలో తాజాగా ఈ జంట పాల్గొంది. సెలెబ్రిటీలను పట్టుకొచ్చి చేసిన ఎపిసోడ్‌లో ఇంద్రనీల్, మేఘనలు క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. తన భర్తతో ఇంత వరకు క్లాసికల్ డ్యాన్స్ వేయలేదన్న కోరిక మిగిలిందని... డ్యాన్స్ ప్లస్‌తో అది తీరిందని చెప్పుకొచ్చింది.

వాలెంటెన్సై డే స్పెషల్..
ప్రేమికులు దినోత్సవం సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో మేఘన, ఇంద్రనీల్ గెస్ట్‌లు విచ్చేశారు. ఇందులో ఇంద్రనీల్ మాట్లాడుతూ తన ప్రేమ కథను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తనపై వచ్చిన ట్రోల్స్, భార్యపై వచ్చిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు.

తను లేకపోతే..
మా ఫాదర్ బొమ్మరిల్లు ఫాదర్ టైపు.. నాకు ఏం కావాలన్నా ఆయనే.. పెళ్లి తరువాత నా భార్యే నాకు అన్నీ.. ఆమె నాకు భార్యగా లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా.. చాలామంది చాలా కామెంట్లు చేస్తారు.. నా భార్యను గురించి.. ఆమెను ఎందుకు చేసుకున్నావ్..? లావుగా ఉంటుంది ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడని రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. వాళ్లందరికీ నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే.. నాకు తనంటే ప్రాణం. తను లేకపోతే నేను లేను.. ఐ లవ్ యూ సో మచ్..అంటూ భార్యపై ప్రేమను కురిపించాడు ఇంద్రనీల్.


Click it and Unblock the Notifications











