twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు, బ్రహ్మానందంపై ‘పద్మశ్రీ’ వివాదం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'దేనికైనా రెడీ' సినిమాలో పేర్ల ప్రదర్శన సమయంలో నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం 'పద్మశ్రీ' అవార్డుకు ఉపయోగించుకున్నారని, ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని బీజేపీ నేత ఇంద్ర సేనారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. వారికి ఇచ్చిన 'పద్మశ్రీ' అవార్డులను వెనక్కి తీసుకోవాలని కూడా ఆయ తన పిటీషన్లో కోరారు.

    అదే విధంగా ఒక సామాజిక వర్గం మనో భావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న 'దేనికైనా రెడీ' చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని ఇంద్రసేనారెడ్డి తన పిటీషన్లో కోరాను. ఇప్పటికే 'దేనికైనా రెడీ' చిత్రంపై పలు కేసులు నమోదడంతో పాటు, కోర్టుల్లో పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

    మంచు విష్ణు-హన్సిక నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం పై వారం రోజుల క్రితం ఆ చిత్ర నిర్మాత మోహన్ బాబుతో పాటు మరో ఏడుగురిపై వరంగల్ జిల్లా జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేనికైనా రెడీ చిత్రం బ్రాహ్మణుల కించ పరిచే విధంగా ఉందని బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ సహాయ కార్యదర్శి వారణాసి పవన్ కుమార్ జనగామ కోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ జరుపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు చిత్ర నిర్మాత మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, నడుడు బ్రహ్మానందం, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, సెన్సార్ బోర్డు ఆఫీసర్ ఎ. ధనలక్ష్మి, రచయిత కోన వెంకట్ మరియు వెంకట సుబ్రహ్మణ్యం, బి. రవిలపై కేసులు నమోదయ్యాయి.

    English summary
    BJP leader Indrasena Reddy petition in HC on Denikaina Ready. A petition was filed in the High Court on Wednesday, seeking a direction to the central government to recommend to the President annulment of the national award, Padma Shri, given to actor-producer M Mohan Babu and popular film comedian Brahmanandam in the year 2007 and 2009, respectively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X