చంద్రబాబు ఓటమికి బోయాపాటే కారణం.. జగన్‌కి ఆ రకంగా.. నెట్టింట గుప్పుమంటున్న వార్తలు

మాస్ ఆడియన్స్‌ని మెప్పించే సినిమా అందులో భారీ ఫైట్లు.. శృతిమించిన డైలాగ్స్.. కన్నీళ్లతో బకెట్లు నిండే ఎమోషన్స్ ఇవే గుర్తొస్తాయి డైరెక్టర్ బోయపాటి శ్రీను పేరు వినగానే. ఆ మధ్య డైరెక్టర్‌గా మంచి తెచ్చుకున్నప్పటికీ.. ప్రస్తుతం మాత్రం కాలం కలిసి రావడం లేదనే చెప్పుకోవాలి. ఇటీవలే వినయ విధేయ రామ రూపంలో భారీ డిజాస్టర్, ఆ వెంటనే బాలయ్య సినిమా అనుకుంటే అదీ అటకెక్కడం ఇక తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలకు పరోక్షంగా కారణమవ్వడం బోయపాటికి ఊహించని పరిణామాలే.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు బయటకు రాగా.. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడంతో తెలుగు దేశం పార్టీ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి పేరు కూడా వినిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 150 పైగా సీట్లలో ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో సైకిల్ ఎక్కడికో కొట్టుకుపోయింది. బోయపాటి యాడ్స్ జగన్‌కి ఈ రకంగా ప్లస్ అయ్యాయి.

 Indrectly Boyapati help YS Jagan

తమ టర్మ్‌లో అభివృద్ది చేయకపోయినా, అభివృద్ది చేసినట్లుగా గ్రాఫిక్స్ సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టడం, తమ అసమర్ధతకు ప్రతిపక్షంపై రుద్దటం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడం, రాజధాని నిర్మాణలోపం, రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెబుతూనే గొప్పలకు పోవడం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే వాటిలో ఒకటిగా మాస్ డైరెక్టర్ బోయపాటి తీసిన యాడ్స్ కూడా అనే టాక్ రావడంతో షాకవుతున్నారంతా. ఓట్లు దండేది పోగా ఉన్న ఓట్లను ఈ యాడ్స్ ఉదరగొట్టాయని చెప్పుకుంటున్నారు జనం.

తాజాగా 2019 ఎన్నికలకు గాను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రమోషన్ బాధ్యతలు భుజాన వేసుకున్నారు బోయపాటి. ఈ మేరకు టీడీపీకి సప్పోర్ట్ గా కొన్ని యాడ్స్ చిత్రీకరించారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాడ్స్ సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వీర కుమ్ముడు కుమ్మేస్తున్నాయి. అలాగే ఇవి వాస్తవాలకు దూరంగా ఉండటంతో టీడీపీని నవ్వుల పాలు చేశాయి కూడా. ఎమోషనల్‌గా ఓటర్లను టీడీపీ బుట్టలో వేయాలని బోయపాటి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రిసల్ట్.. టీడీపీ అట్టర్ ప్లాప్. ఈ నేపథ్యంలో పరోక్షంగా టీడీపీ ఓటమిలో బోయపాటి కూడా పాత్రదారుడే అనే టాక్ బలంగా వినిపిస్తోంది సినీ, రాజకీయ వర్గాల్లో. చూడాలి మరి దీనిపై బోయపాటి స్పందిస్తారా? లేదా? అనేది.

More from Filmibeat

Read more about: boyapati srinu tdp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X