సినిమా లోకంలో విఘ్నేశ్వరుడు: సల్మాన్ ఖాన్ నుండి బిగ్‌బాస్ రోల్ రైడా వరకు...

By Bojja Kumar

భారత దేశం వ్యాప్తంగా ప్రతి ఏటా గొప్పగా జరిగే ఉత్సవాల్లో వినాయక చవితి ఉత్సవాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దేశ వ్యాప్తంగా చిన్నపెద్ద తేడా లేకుండా ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరో పదిరోజుల్లో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సందడి మొదలైంది.

గణేషుడి ఉత్సవాలు ప్రభావం కేవలం సామాన్య ప్రజల మీద మాత్రమే కాదు... సినిమాపై, సినిమా సెలబ్రిటీలపై కూడా ఉంది. పలు సినిమాల్లో గణేష్ చతుర్థి ఉత్సవాలపై ప్రత్యేకంగా పాటలను చిత్రీకరించడం మనం గతంలో చూశాం. ప్రజల జీవితాల్లో భాగంగా మారిన ఈ ఉత్సవాలను అవకాశం ఉంటే తమ సినిమాల్లో ఫోకస్ చేసే ప్రయత్నం చేయడం చాలా కాలంగా నడుస్తున్న ఆనవాయితీ.

Induan Cinemas Rocking Ganesh Chaturthi Songs

ఈ మధ్య కాలంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా వీడియో ఆల్బమ్స్ కూడా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగులో పోటీదారుగా ఉన్న రోల్ రైడా గతేడాది 'శంకర్ కా బేటా' పేరుతో ఓ వీడియో ఆల్బం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రోల్‌కు మంచి గుర్తింపు తెచ్చిన ఆల్బంలో ఇదీ ఒకటి. దీన్ని దాదాపు 40 లక్షల మంది ఆ వీడియో వీక్షించారు.

ఇక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ తమ ఇంట్లో గణేష్ చతుర్థి ఉత్సవాలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ దాదాపు 15 ఏళ్లుకపైగా ప్రతి సంవత్సరం గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సల్మాన్ చిన్న చెల్లెలు అర్పిత ఖాన్ ద్వారా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని సల్మాన్ ఫ్యామిలీ కొనసాగిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గణపతి పూజా కార్యక్రమాలతో సల్మాన్ ఖాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ సందడిగా మారబోతోంది. ఈ పూజా కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం హాజరవుతుంటారు.

సల్మాన్ ఖాన్ నటించిన 'వాంటెడ్' సినిమాతో పాటు పలు చిత్రాల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ బ్యాక్ డ్రాపుతో పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ చిత్రంలోని 'దేవశ్రీ గణేషా' అనే పాటు అప్పట్లో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది. షారుక్ ఖాన్ 'డాన్' సినిమాలో సైతం గణేషుడిపై ఓ స్పెషల్ సాంగ్ ఉంది.

Induan Cinemas Rocking Ganesh Chaturthi Songs

తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య సినిమాల్లో కూడా వినాయక చవితి నేపథ్యంలో పాటలు, సీన్లు గతంలో ప్రేక్షకులను అలరించాయి. వినాయక చవితి సీజన్ సినిమా రిలీజ్‌లకు బాగా కలిసొస్తుందని నమ్ముతుంటారు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ లాంటి వారు విఘ్నేశ్వరుడిని తమ పబ్లిసిటీ వాడుకోవడం గతంలో చూశాం. సినిమా లోకంలో జరిగే ఈ వ్యవహారాలన్నీ నిశితంగా గణేషుడు పరిశీలిస్తుంటాడని, వారికి తగిన ప్రతిఫలం అందిస్తుండటాడని భక్తుల నమ్మకం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X