twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాకిస్థాన్‌కు పూనమ్ పాండే ‘బ్రా’ పంచ్... వైరల్ అవుతున్న వీడియో!

    |

    Recommended Video

    పాకిస్థాన్‌కు పూనమ్ పాండే ‘బ్రా’ పంచ్... వైరల్ అవుతున్న వీడియో!

    ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరు దేశాల అభిమానులు ఉత్కంఠగా మ్యాచ్ వీక్షిస్తారు. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి.

    ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మీడియా రూపొందించిన ఓ యాడ్ వివాదాస్పదం అయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్‌ను కించపరుస్తూ ఈ యాడ్ చిత్రీకరించడమే ఇందుకు కారణం. ఈ యాడ్‌కు సెక్సీ మోడల్ పూనమ్ పాండే అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

    పాకిస్థాన్ యాడ్‌కు ఇదే నా సమాధానం

    పాకిస్థాన్ యాడ్‌కు ఇదే నా సమాధానం

    డియర్ పాకిస్థాన్... అంటూ ఓ వీడియో విడుదల చేసిన పూనమ్ పాండే తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఒక పాకిస్థాన్ యాడ్ చూశాను. ఒక హీరోను కించపరిచారు. మీరు చేసింది మంచి పని కాదు. అయినా టీ కప్పుపై సెటైర్లు వేయడం ఎందుకు? మీకు కావాల్సింది ఇదే అంటూ.. తన ‘బ్రా' కప్ తీసి ప్రదర్శించింద పూనమ్.

    ఇండియాను కించపరిచేందుకే...

    పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన మిగ్ యుద్ధ విమానంతో వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ వెళ్లగా... అతడి విమానం కూలిపోవడంతో పాక్ ఆర్మీకి చిక్కాడు. దాదాపు 60 గంటల తర్వాత అతడిని ఇండియాకు అప్పగించారు. తాజాగా విడుదలైన యాడ్లో అభినందన్ వర్దమాన్‌ను పోలిన వ్యక్తికి టీమిండియా దుస్తులు వేసి... వరల్డ్ కప్ సందర్భంగా ఇండియాను కించ పరచడమే లక్ష్యంగా ఈ యాడ్ రూపొందించారు.

    పూనమ్ పాండేపై ప్రశంసలు

    పూనమ్ పాండేపై ప్రశంసలు

    పాకిస్థాన్‌కు తన ‘బ్రా' కప్పులు చూపిస్తూ కౌంటర్ ఇచ్చిన పూనమ్ పాండేపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా వారికి కావాల్సింది నువ్వు వేసుకునే డబుల్ డి బ్రా కప్పులే.... వరల్డ్ కప్ కాదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే పూనమ్ పాండే తీరును తప్పుబట్టేవారూ లేక పోలేదు.

    టీమిండియా కోసం అందాల ఆరబోత

    టీమిండియా కోసం అందాల ఆరబోత

    ఐసీసీ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇండియా మొత్తం క్రికెట్ ఫీవర్లో మునిగిపోయి ఉండగా... క్రికెట్ వరల్డ్ కప్ ట్రీట్ పేరుతో అభిమానులకు అందాల విందు చేస్తూ పూనమ్ పాండే సెన్సేషన్ క్రియేట్ చేసింది. గతంలోనూ పూనమ్ టీమిండియా కోసం నగ్నంగా ప్రదర్శనలు ఇస్తానంటూ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Poonam posted a video on social media with the caption that read, "My Answer to the Pakistani AD. #INDvPAK World Cup 2019." The video shows Poonam showing the Pakistani ad on her mobile while sipping on a cup of tea.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X