»   »  వన్‌ఇండియా-ఫిల్మీబీట్ ప్రతినిధికి ఇండీవుడ్ అవార్డ్

వన్‌ఇండియా-ఫిల్మీబీట్ ప్రతినిధికి ఇండీవుడ్ అవార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Indywood Media Awards 2017 మీడియా అకాడమీ తెలియదు | Oneindia Telugu

'ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్' మీడియా ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం బుధవారం బేగంపేటలోని ది ప్లాజా హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. తెలుగు సినిమా విభాగానికి సంబంధించిన ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, రేడియో మాధ్యమాల్లో ఉత్తమ సేవలు అందించిన పాత్రికేయులకు మీడియా ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా వన్ ఇండియా, ఫిల్మీబీట్ ప్రతినిధి రాజాబాబు అనుముల మీడియా ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇండీవుడ్ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సోహన్‌రాయ్‌, దర్శకుడు ఎన్ శంకర్ చేతుల మీదుగా అవార్డు ప్రధానోత్సవం జరిగింది.

Indywood Media Excellence Awards

సినీరంగంలో సాంకేతికతను అభివృద్ధి చేయడం, దేశంలో వివిధ చిత్రపరిశ్రమలను ఒక తాటిపైకి తీసుకురావడమనే ప్రధాన ఉద్దేశ్యంతో 'ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్' సంస్థ ఏర్పాటయిందని ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సోహన్‌రాయ్‌ తెలిపారు. 'ఇండీవుడ్‌ కార్నివాల్‌ 3వ ఎడిషన్ ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి 4 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందన్నారు.

English summary
Oneindia.com chief sub editor A.Raja Babu bags Media Excellence Awards at the 3rd edition of “indywood Media Excellence Awards” in Hyderabad on Wednesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu