మహిళల కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా...
హైదరాబాద్: మహిళల అత్యాచారాలను నియంత్రించేందుకు రూపొందించిన 'మర్ద్' ప్రోగ్రాం లో భాగస్వామి అయిన మహేష్ బాబు మరోసారి మహిళా ఈవెంట్ కి హాజరై తన మద్దతు ప్రకటిస్తున్నారు. ఉమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా ఇన్ఫోసిస్ సంస్ధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌళి ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఈ ఈవెంట్ చోటు చేసుకోనుంది.
ఇక 'పోకిరి' తర్వాత పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా మహేష్‌బాబు కనిపించబోతున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బళ్లారిలో జరుగుతోంది. 'దూకుడు'తో మహేష్‌బాబుని పరర్ ఫుల్ పోలీసుగా చూపించిన శ్రీనువైట్ల ఇప్పుడు మరోసారి మహేష్‌తో ఖాకీ కట్టించారు. వీరిద్దరి కలయికలో 'ఆగడు' రూపుదిద్దుకుంటోంది. దాంతో ఈ చిత్రంపై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''దూకుడు' తర్వాత మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. దానికి మించి వినోదం పండేలా దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. మహేష్ పాత్ర చిత్రణ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది''అంటున్నారు. పాటల్ని కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications












