రామ్ చరణ్‌పై సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ కామెంట్స్.. ఆయన నటన ఇలాంటిదంటూ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కాస్త తడబడినా ఇప్పుడు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ పోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్ రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వివరాలు చూద్దామా..

చిరుతలా వచ్చిన రామ్ చరణ్.. ఇప్పుడు
మెగాస్టార్ వారసుడిగా 'చిరుత' సినిమాతో సినీ గడప తొక్కిన రామ్ చరణ్.. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయనకు భారీ ఫాలోయింగ్‌తో పాటు మెగా అభిమానుల సపోర్ట్ ఫుల్లుగా ఉంది. కెరీర్‌లో అడపాదడపా తడబడినా చెర్రీ.. తన కెరీర్ బిల్డ్ చేసుకున్న విధానం భేష్ అని చెప్పుకోవచ్చు.

రామ్ చరణ్ పాపులారిటీ పెంచిన రంగస్థలం
అయితే రామ్ చరణ్ కెరీర్‌లో ది బెస్ట్ చిత్రంగా నిలిచి భారీ కలెక్షన్స్ రాబట్టింది రంగస్థలం మూవీ. ఈ చిత్రంలో చెవిటివాడిగా చెర్రీ చూపిన సహజ అభినయం విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పటిదాకా రామ్ చరణ్ చేసిన అన్ని సినిమాలు ఓ ఎత్తయితే.. ఈ ‘రంగస్థలం' సినిమా మరో ఎత్తుగా నిలిచింది. ఈ సినిమాతో చెర్రీ పాపులారిటీ బాగా పెరిగింది.

రామ్ చరణ్ నటన.. ఇన్ఫోసిస్ ఫౌండర్ కామెంట్స్
కాగా తాజాగా ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్ పర్సన్ సుధా నారాయణ మూర్తి రంగస్థలంలో రామ్ చరణ్ నటనను ప్రశంసించారు. ఆయన నటన అత్యద్భుతం అంటూ ఆకాశానికెత్తారు. తాను చాలా ఏళ్ల తర్వాత రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా చూశానని, అందులో చిట్టిబాబుగా చెర్రీ నటన అబ్బురపరిచింది ఆమె చెప్పారు.

చిన్నతంలో ఎన్టీఆర్ సినిమాలు.. ఇప్పుడు రంగస్థలం
తన చిన్నతంలో ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇష్టపడి చూసేదాన్ని అని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ''మాయా బజార్, దాన వీర శూర కర్ణ, సీతా రామ కళ్యాణం'' వంటి సినమాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తాజాగా తన అభిమాన చిత్రాల్లో 'రంగస్థలం' కూడా చేరిందని ఆమె చెప్పారు.
Recommended Video

రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు
అంతేకాదు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరును అద్భుతంగా వర్ణించారు సుధా నారాయణ మూర్తి. ఆ వెంటనే అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన ‘మనం' సినిమా కూడా చూసినట్టు చెప్పిన ఆమె ఆ సినిమా కూడా తనకు బాగా నచ్చిందని తెలిపారు.


Click it and Unblock the Notifications











