»   » గబ్బర్‌సింగ్‌‌కు నో చెప్పిన శృతి హాసన్, ఎందుకంటే?

గబ్బర్‌సింగ్‌‌కు నో చెప్పిన శృతి హాసన్, ఎందుకంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'గబ్బర్ సింగ్' చిత్రంలో శృతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే. మరి నో చెప్పడం ఏమిటనుకుంటున్నారా?. అసలు వివరాల్లోకి వెళితే....గబ్బర్ సింగ్ చిత్రం మొదలు పెట్టడానికి ముందు దర్శకుడు హరీష్ శంకర్ హీరోయిన్ రోల్ కోసం శృతి హాసన్‌ను సంప్రదించాడట.

అయితే తొలుత ఈ సినిమా చేయడానికి ఆమె ఒప్పుకోలేదట. కారణం అది హిందీ సినిమా 'దబాంగ్' చిత్రానికి రీమేక్ కావడమే. హిందీ దబాంగ్‌లో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేక పోవడం కూడా అందుకు ఓ కారణం. అయితే కథలో మార్పులు చేసామని, 'గబ్బర్ సింగ్' చిత్రంలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి....స్క్రిప్టు చెప్పిన తర్వాతగానీ శృతి అంగీకరించలేదు.

ఈ విషయాన్ని శృతి స్వయంగా ఇటీవల వెల్లడించింది. 'హరీష్ నన్ను కన్విన్స్ చేయడం వల్లనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారితో సినిమా చేసే అవకాశం దక్కింది. గబ్బర్ సింగ్ సినిమాను రిజక్ట్ చేసి ఉంటే ఇప్పుడు నేను ఎలా ఉండేదాన్నో ఊహించుకోవడానికే భయంగా ఉంది. తన తర్వాత సినిమాలో కూడా మంచి పాత్ర ఇస్తానని హరీష్ శంకర్ చెప్పారు. ఇప్పుడు 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ఎన్టీఆర్ తో చేస్తున్నారు. ఇందులో నా పాత్ర చిన్నదే అయినా సినిమాకు చాలా ముఖ్యమైనది' అని శృతి హాసన్ చెప్పింది.

మొత్తానికి శృతి హాసన్ 'గబ్బర్ సింగ్' సినిమా కారణంగా స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. అంతకు ముందు ఆమె హిందీ చిత్రాలతో పాటు ఇతర చిత్రాలు చేసినా అదృష్ణం కలిసిరాలేదు. ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు లక్కీ హీరోయిన్ గా మారి ఇటు తెలుగుతో పాటు, అటు హిందీలోనూ పలు అవకాశాలు దక్కించుకుంటోంది.

English summary

 Shruti Haasan said, "Initially I said no to Harish when he approached me. But he narrated the story and told me to decide then after. He made enough changes to the script and I liked the subject and also my characterization. It was really pleasure working with such a super star Pawan Kalyan."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu