twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు ఫ్యామిలీకి అన్యాయం: సర్కారును చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలా? మెగా నిర్మాత ఫైర్

    By Rajababu
    |

    Recommended Video

    మెగా ఫ్యామిలీకి అన్యాయం.. మెగా నిర్మాత ఫైర్

    సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ చాటే నటీ నటులకు ఇచ్చే నంది అవార్డుల ఎంపిక మరోసారి వివాదాస్పదమైంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై మెగా అభిమానులతోపాటు పలువురు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ ప్రకటించిన అవార్డుల్లో మెగా హీరోల్లో కేవలం అల్లు అర్జున్‌కు తప్ప మరోకరికి అవార్డులు రాకపోవడంపై ఫైర్ అవుతున్నారు. రుద్రమదేవి చిత్రంలో నటించిన అల్లు అర్జున్‌కు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యాటగిరీలో అవార్డును ఇవ్వడం విమర్శలకు కారణమైంది. అవార్డుల ఎంపికపై మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు బహిరంగంగా విమర్శలు చేయడం మరింత వివాదం రాజుకొన్నది.

     ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు

    ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు

    అధికార తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే తక్షణం చంద్రబాబు సర్కార్ వద్ద శిక్షణ తీసుకోవాలి అని బన్నీవాసు ఘాటుగా కామెంట్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అవార్డుల ఎంపికపై సోషల్ మీడియాలో బహిరంగ విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో బన్నీ వాసు వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి.

     చిరంజీవి ఫ్యామిలీకి అన్యాయం

    చిరంజీవి ఫ్యామిలీకి అన్యాయం

    నంది అవార్డుల ఎంపిక విషయంలో మెగాస్టార్ చిరంజీవి కుటంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఉద్దేశ్యపూర్వకంగానే మెగా ఫ్యామిలీని అవమానపరుస్తున్నారు అని బన్నీవాసు ఆరోపించారు. నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదు. గత మూడేళ్లలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను పరిశ్రమకు అందించారు అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

     అల్లు అర్జున్‌కు ఆ అవార్డు ఇస్తారా?

    అల్లు అర్జున్‌కు ఆ అవార్డు ఇస్తారా?

    టాలీవుడ్‌కు రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేమిటి అని బన్నీ వాసు ప్రశ్నించాడు. ఇది ముమ్మాటికీ మెగా ఫ్యామిలీని అవమానించడమేనని వ్యాఖ్యానించాడు. చిరంజీవి ఫ్యామిలీ అవార్డుల ఎంపిక విషయాన్ని పట్టించుకోలేదు. అయితే మెగా ఫ్యామిలీకి జరిగిన ఆవేదనను తట్టుకోలేక ప్రశ్నిస్తున్నాను అని బన్నీవాసు తెలిపారు.

     మగధీరకు అన్యాయమే..

    మగధీరకు అన్యాయమే..

    గతంలో మగధీర చిత్రానికి కూడా ఇలాంటి అన్యాయమే జరిగిందనే విషయాన్ని బన్నీ వాసు గుర్తు చేశారు. మగధీర చిత్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కినా రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కలేదనే విషయాన్ని మరోసారి ఆయన ప్రస్తావించారు. ఈ అవార్డుల విషయమే కాకుండా.. చిరంజీవి కుటుంబానికి కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతుంది అని బన్నీవాసు ఆవేదన వ్యక్తం చేశాడు.

     ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..

    ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో..

    నంది అవార్డుల ఎంపిక గతంలోనూ వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీ అనుకూలంగా ఉండే వ్యక్తులకు, జ్యూరీ సభ్యులకు సన్నిహితంగా మెలిగే వ్యక్తులకు అవార్డులు దక్కుతాయనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుత నంది అవార్డులపై వస్తున్న విమర్శల అధికార టీడీపీ ప్రభుత్వం, జ్యూరీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

    English summary
    2014, 2015, 2016 Nandi Awards selection process become most controversial in the media and film circles. This issue became high debate in social media too. In this occassion, producer Bunny Vasu criticised Andhra Pradesh Government process for selecting one group of the film Industry. He said, lot injustice happening to Chirajeevi Family in the awards selection process.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X