ఫొటోలు : అసిన్ వెడ్డింగ్ రిసెప్షన్.. వాళ్ళు మిస్?
ముంబై: రీసెంట్ గా వివాహం చేసుకున్న జంట...అసిన్, రాహుల్ శర్మ ఓ గ్రాండ్ రిసెప్షన్ ని తన క్లోజ్ సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ కు ముంబైలో రీసెంట్ గా ఇచ్చారు. బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి స్టార్స్ హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. ఎవరెవరు వచ్చారు. ఎంత ముచ్చటగా జరిగింది అనేది మీకు ఈ క్రింద ఫొటొల్లో చూడవచ్చు.
తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్ మైక్రోమ్యాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సినీ నటులు అక్షయ్‌కుమార్, సుస్మితా సేన్, జాక్వెలిన్ ఫెర్నాండెంజ్, ఖుష్భు, రానా, వెంకటేశ్, శిల్పా శెట్టి, రాజ్‌కుంద్ర, ప్రీతీ జింటా, మనీష్ పాల్, మాధవన్ తదితరులు హాజరై సందడి చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
స్లైడ్ షోలో ఫొటోలు...

ముచ్చటైన జంట
ఈ జంట చాలా ముచ్చటగా ఉందని బాలీవుడ్ మీడియా పొగుడుతోంది. ఇప్పటికే ఈ జంట గురించి టాబ్లెయిడ్స్ లో రాస్తున్నారు.

సెల్ఫీ
శిల్పాశెట్టి తో కలిసి రాహుల్ శర్మ సెల్ఫీ దిగుతూ..ఇలా

కారకం..
అక్షయ్ కుమార్ స్నేహితుడే రాహుల్ శర్మ. అక్షయే పరిచయం చేసాడు. అందుకు అక్షయే స్పెషల్ ఎట్రాక్షన్.

జాక్విలన్ తో
అసిన్ తన స్నేహితురాలు జాక్విలిన్ ఫెర్నాడెజ్ తో కలిసి ఇలా ...

ముద్దు పెట్టుకుంటూ
తన భర్త రాహుల్ శర్మని ముద్దు పెట్టుకుంటూ అసిన్...

ఛేతన్ భగత్
ఈ ఫొటోలో మీరు రైటర్ ఛేతన్ భగన్ ..పొటోకు ఫోజ్ ఇవ్వటం గమనించవచ్చు.

రిషీ కపూర్
తను ఆల్ ఈజ్ ది వెల్ చిత్రంలో కలిసి నటించిన రిషీ కపూర్ తో కలిసి ఇలా...

ఫ్రెండ్స్
అసిన్ క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఫొటో దిగుతూ...

లవ్ బర్డ్స్ లా
ఈ కొత్త జంట ఆనందోత్సాహల్లో మునుగుతేలుతోంది.

దివ్య కోస్ల కుమార్
తన కొత్త చిత్రం ప్రమోషన్ లో బిజీగ ఉన్నా రిసెప్షన్ కు వచ్చి శుభాకాంక్షలు తెలియచేసారు.

మాధవన్
రాజ్ హిర్వాని..సాలా కుద్దూస్ చిత్రంలో చేస్తున్న మాధవన్ ..ఈ రిసెప్షన్ కు విచ్చేసారు.

రాజ్ కుంద్రాతో
శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ఈ వేడుకకు వచ్చారు.

తెలుగునుంచి
తెలుగునుంచి రానా, వెంకటేష్ ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు.

జాక్విలిన్
రిసెప్షన్ పార్టీలో ఇండియన్ డ్రస్ లో జాక్విలిన్ ఇలా మెరిసిపోయింది.

ప్రపోజ్ చేయటానికే
ఆరు కోట్ల విలువచేసే వజ్రంపు ఉంగరంతో అసిన్ ని ప్రపోజ్ చేసాడని సమాచారం.


Click it and Unblock the Notifications











