»   » చైతూ తెలివిగా సర్దుకున్నాడు.. సాయిధరమ్ తేజ్ బలయ్యాడు.. లాస్ తెలిస్తే షాకే..

చైతూ తెలివిగా సర్దుకున్నాడు.. సాయిధరమ్ తేజ్ బలయ్యాడు.. లాస్ తెలిస్తే షాకే..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Naga Chaitanya is Real 'Intelligent'

  సినీ పరిశ్రమలో ఓ హీరో వదిలేసుకొన్న సినిమాలను మరో హీరో చేసి హిట్టుకొట్టిన సందర్భాలను అప్పుడప్పుడు చూస్తుంటాం. అలానే ఒక హీరో వద్దనుకొన్న కథను మరో హీరో పట్టుకొని చేతులు కాల్చుకొన్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా అలాంటి సంఘటనే టాలీవుడ్‌లో కనిపించిందనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు అలా బలైన వారిలో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఇంతకీ ఏమి జరిగిందంటే..

  సాయిధరమ్ తేజ్‌కు చేదు అనుభవం

  సాయిధరమ్ తేజ్‌కు చేదు అనుభవం

  మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలింజెట్ చిత్రం ఇటీవలే విడుదలైంది. సాయిధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫ్లాప్‌ను మూటకట్టుకొన్నది. 70 దశకం నాటి టేకింగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉందనే అపవాదును దర్శకుడు వినాయక్ మూట గట్టుకొన్నాడు.

  నాగచైతన్య ఫస్ట్ ఛాయిస్

  నాగచైతన్య ఫస్ట్ ఛాయిస్

  ఇంటిలిజెంట్ అట్టర్‌ఫ్లాప్ అని డిసైడ్ అయిన తర్వాత ఓ ఆసక్తికరమైన స్టోరి మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఇంటిలిజెంట్ కథను ముందుగా ఆకుల శివ అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు వినిపించాడట.

   చైతన్య తెలివిగా

  చైతన్య తెలివిగా

  కథ, కథనాలు విభిన్నంగా లేకపోవడం లాంటి అంశాలను నాగచైతన్య ముందే పసిగట్టాడట. దాంతో ఈ సినిమా నాకు వర్కవుట్ కాదని చైతూ చేతులు దులిపిసుకొన్నాడు. ఆ తర్వాత పాత చింతకాయ పచ్చడి కథ సాయిధరమ్ తేజ్ ముందు పెట్టాడు.

   బుట్టలో పడిన సాయిధరమ్ తేజ్

  బుట్టలో పడిన సాయిధరమ్ తేజ్

  నిర్మాత సీ కల్యాణ్ కథపై కొంత సానుకూలంగా ఉండటం, ఈ ప్రాజెక్ట్ చేయడానికి దర్శకుడు వినాయక్ రంగంలోకి దిగడంతో సాయిధరమ్ తేజ్ బుట్టలోపడిపోయాడు. అంతేకాకుండా కథా, రచయిత ఆకుల శివ, దర్శకుడు వినాయక్ కాంబినేషన్‌కు మంచి క్రెడిట్ కూడా ఉండటంతో సాయిధరమ్ తేజ్ ఏదో మ్యాజిక్ అవుతుందని ఫిక్సైపోయాడు.

   సాయిధరమ్ తేజ్‌కు ఐదో ఫ్లాప్

  సాయిధరమ్ తేజ్‌కు ఐదో ఫ్లాప్

  సాయిధరమ్ తేజ్ క్రేజ్, బాడీలాంగ్వేజ్‌కు తగినట్టు మాస్ ఎలిమెంట్స్ జొప్పించి, పాతతరం కథనంతో ఇంటిలిజెంట్‌ను వండివర్చారు. తీరా సినిమా తెరపై చూస్తే ఈ కాలంలో వచ్చే కథ కాదని ప్రేక్షకులు తొలి ఆటకే తేల్చిపడేశారు. ఇంకేముంది సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో ఐదో ఫ్లాప్‌గా మిగిలింది.

  వినాయక్ నుంచి ఇలాంటి సినిమానా?

  వినాయక్ నుంచి ఇలాంటి సినిమానా?

  టాగోర్, ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన వినాయక్ నుంచి ఇలాంటి సినిమాను చూసిన ప్రేక్షకులు, మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు వినాయక్ ఇలాంటి సినిమాను తీస్తాడా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు.

   భారీ నష్టాల్లో డిస్టిబ్యూటర్లు

  భారీ నష్టాల్లో డిస్టిబ్యూటర్లు

  ఇంటిలిజెంట్ చిత్రం డిస్టిబ్యూటర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తున్నది. తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 4 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం సుమారు 27 కోట్లకు అమ్మినట్టు తెలుస్తున్నది. దాదాపు ఈ చిత్రానికి 20 కోట్లకుపైగే నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది.

  English summary
  Sai Dharam Tej's Intelligent movie become disaster at box office. Hero Naga Chaitanya Akkineni was first chioce this movie. But Chaitu was rejected because of story, treatment. But Sai Dharam Tej was shown interest do film for VV Vinayak. But Vinayak have not saved Sai Dharam Tej from flops.
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more