రాంచరణ్, రానా మధ్య హీరోయిన్ల గురించి చర్చ.. కనీసం అది కూడా తెలియదు వాళ్ళకి!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆ మధ్యన రానా నిర్వహిస్తున్న నెం 1 యారి షోకు హాజరైన సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ చిత్ర ప్రమోషన్ లో భాగంగా రాంచరణ్, కియారా అద్వానీ ఇద్దరూ నెం 1 యారీ షోకు హాజరయ్యారు. ఈ షోలో రాంచరణ్, రానా మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఉత్తరాది నుంచి వస్తున్న హీరోయిన్ల గురించి రాంచరణ్, రానా మధ్య జరిగిన చర్చవైరల్ అవుతోంది. ఇంతకీ వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు చూద్దాం!

మనిద్దరిలో ఎవరు పెద్ద
రాంచరణ్ షోకు హాజరు కాకాగానే నాకు ఎప్పటి నుంచో ఓ డౌట్ ఉంది క్లారిఫై చేసుకుందాం అని రానా అంటాడు. ఇది షో కదా ప్రతిదానికి సమాధానం ఇస్తానని అనుకోకు అంటూ రాంచరణ్ సరదాగా బదులిచ్చాడు. నువ్వు నాకన్నా చిన్నవాడివా పెద్దవాడివా అని అడగగా.. అసలు నా వయసు నాకు తెలియదు అని రాంచరణ్ బదులిచ్చాడు. స్కూల్ లో ఉన్నప్పుడు నువ్వు నా జూనియర్. నేను ఫెయిల్ కావడం వలన ఇద్దరం క్లాస్ మేట్స్ అయ్యాం అని రానా తెలిపాడు.

రంగస్థలం గురించి మాట్లాడకుండా
ఈ షోలో మనం తప్పనిసరిగా రంగస్థలం చిత్రం గురించి మాట్లాడాలి. ఎందుకంటే అది నీకు ఒక లైబ్రరీ లాంటి చిత్రం అని రానా తెలిపాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది అని రాంచరణ్ అనగానే 10 అయ్యిందా అని రానా ఆశ్చర్యపోయాడు. ఇక కొత్తగా ప్రయత్నించాలి అని అనుకున్నా. ఆ సమయంలో అనుకోకుండా కామన్ ఫ్రెండ్ ద్వారా సుకుమార్ తో పరిచయం అంది. మిమ్మల్ని సుకుమార్ ఒకసారి కలవాలని అంటున్నారు అని నా స్నేహితుడు చెప్పాడు. వెంటనే ఫోన్ చేసి లంచ్ కు ఆహ్వానించా.

బన్నీతో చేశారు.. మరి నాతో
సుకుమార్ తో లంచ్ పూర్తయ్యాక.. సరదాగా మాట్లాడుతుండగా బన్నీతో ఇన్ని సినిమాలు చేశారు, మా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది నాతో చేయరా అని సరదాగా అడిగాను. నా వద్ద కథ రెడీగా ఉంది.. రేపు తీసుకుని వస్తా అని సుకుమార్ వెంటనే అన్నారు. అలా రంగస్థలం చిత్రం సెట్ అయిందని రాంచరణ్ తెలిపాడు.
కనీసం అది కూడా తెలియదు
కియారా అద్వానీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాంచరణ్, రానా మధ్య ఉత్తరాది హీరోయిన్ల గురించి ఆసక్తికర చర్చ జరిగింది. టాలీవుడ్ సినిమాలు ఇష్టపడతావా అని రానా కియారని అడిగాడు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే ముంబయి నుంచి వచ్చిన హీరోయిన్లకు కనీసం తెలుగు అనే భాష ఉంటుందనే విషయం కూడా తెలియదు. తాను అలాంటి హీరోయిన్లతో పనిచేశానని రానా తెలిపాడు. దీనిపై కియారా సమాధానం ఇస్తూ బాహుబలి తర్వాత తెలుగు తెలియని వాళ్ళు ఉండరని తెలిపింది. రాంచరణ్ కల్పించుకుని సౌత్ లో ఉన్న రాష్ట్రాల పేర్లు చెప్పమని కియారాని అడిగాడు. కియారా చెప్పలేకపోయింది.


Click it and Unblock the Notifications











