RRR: అజయ్ దేవగన్ కోసం రాజమౌళి పట్టుబట్టింది అందుకే.. ఆ లక్షణాలతో పాత్ర, సెకండ్ హాఫ్‌లో!

రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురించి చర్చ మొదలైంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు యుక్త వయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. అదృశ్యమైన సమయంలో వీరిద్దరూ ఎలా ఉండేవారు అనేదే ఈ చిత్ర కథ అని రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఆసక్తి రేకెత్తిస్తున్న మరో పాత్ర అజయ్ దేవగన్‌ది.

కీలక పాత్రలో అజయ్ దేవగన్

కీలక పాత్రలో అజయ్ దేవగన్

అజయ్ దేవగన్ బాలీవుడ్ లో స్టార్ హీరో. తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటే తప్ప ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించడానికి ఆయన ఒప్పుకోరని అందరికి తెలుసు. దీనితో అజయ్ దేవగన్ కోసం రాజమౌళి అద్భుతమైన పాత్రనే సిద్ధం చేసి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి, అజయ్ దేవగన్ మధ్య ఈగ చిత్రం నుంచే సాన్నిహిత్యం ఉంది. తాను రిక్వెస్ట్ చేయగానే ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారని రాజమోళి తెలిపిన సంగతి తెలిసిందే.

పట్టుబట్టింది అందుకే

పట్టుబట్టింది అందుకే

ఆర్ఆర్ఆర్ చిత్రం ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కథగా తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ ఇది వరకే భగత్ సింగ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో అజయ్ దేవగన్ భగత్ సింగ్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆ చిత్రంలో అజయ్ తర్వాతే ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన్నే తీసుకోవాలని రాజమౌళి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇక భారీ యాక్షన్ సన్నీవేశాలు ఉన్న చిత్రాల్లో అజయ్ తరచుగా నటిస్తుంటారు.

 సెకండ్ హాఫ్‌లో

సెకండ్ హాఫ్‌లో

అజయ్ దేవగన్ పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలు ప్రచారం జరుగుతున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో 30 నిమిషాల పాటు అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందట. అజయ్ దేవగన్ నటించే సన్నివేశాలు విధ్వంసాన్ని తలపించేలా ఉంటాయని అంటున్నారు. అంత అద్భుతంగా యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి తీర్చిదిద్దుతున్నారట. ఈ చిత్రంలో కూడా అజయ్ దేవగన్ విప్లవ వీరుడిగా భగత్ సింగ్ లక్షణాలతో కనిపిస్తారని అంటున్నారు.

దేశవ్యాప్తంగా చర్చ

దేశవ్యాప్తంగా చర్చ

ఆంధ్ర ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమరం భీమ్ లని నార్త్ ఇండియాకు ముడిపెడుతూ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాహుబలితో తిరుగులేని దర్శకుడిగా మారిపోయిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరో మారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. 2020 జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X