కోటీశ్వరుడే.. కానీ బుర్రలేదు.. బండ్ల గణేష్ గురించి ఆసక్తికరంగా!

మహర్షి చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. త్వరలో అనిల్, మహేష్ కాంబినేషన్ లోని చిత్రం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. తన చిత్రాల్లో హాస్యానికి పెద్ద పీట వేసే అనిల్ రావిపూడి.. మహేష్ తో తెరకెక్కించబోయే చిత్రానికి సంబంధించి నటీనటులతోనే ఆసక్తి పెంచుతున్నాడు.

 వారిద్దరి రీఎంట్రీ

వారిద్దరి రీఎంట్రీ

మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే బండ్ల గణేష్ అనిల్ రావిపూడి, మహేష్ బాబు చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ తన కెరీర్ ఆరంభంలో కామెడీ రోల్స్ లో నటించాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సూపర్ హిట్స్ అందుకున్నాడు. గత ఏడాది రాజకీయాల్లోకి కూడా వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అప్పటి లేడి సూపర్ స్టార్ విజయశాంతి కూడా మహేష్ బాబు చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

కోటీశ్వరుడే కానీ

కోటీశ్వరుడే కానీ

అనిల్ రావిపూడి మహేష్ చిత్రం కోసం బండ్ల గణేష్ పాత్రని చాలా హాస్యభరితంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బండ్ల గణేష్ కోటీశ్వరుడైనప్పటికీ తెలివి తక్కువ వాడిలా కనిపిస్తాడట. ఈ చిత్రంలో బండ్ల గణేష్ చేష్టలు కడుపుబ్బా నవ్వించేలా ఉండబోతున్నాయని అంటున్నారు. అనిల్ రావిపూడి తన ప్రతి చిత్రంలో హాస్యం ప్రధాన అంశంగా ఉంటుంది. ఇక మహేష్ బాబు చిత్రంలో కూడా హాస్యం, దేశభక్తి అంశాలు హైలైట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాజకీయాలకు దూరం

రాజకీయాలకు దూరం

గత ఏడాది తెలంగాణ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేశాడు. మీడియాలో, ఎన్నికల ప్రచారంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఇటీవల రాజకీయాలకు తాను సరిపోనని, ఇకపై పాలిటిక్స్ జోలికి వెళ్లనని బండ్ల గణేష్ ప్రకటించాడు. తిరిగి సినిమాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ నటుడిగా కనిపించబోతుండడంతో అనిల్ రావిపూడి, మహేష్ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది.

దిల్ రాజు నిర్మాణంలో

దిల్ రాజు నిర్మాణంలో

మహేష్ బాబు చిత్రాన్ని కూడా అనిల్ రావిపూడి దిల్ రాజు నిర్మాణంలోనే చేయబోతున్నాడు. అనిల్ సుంకర ఈ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరిస్తారట. ఈ చిత్రంలో మహేష్ బాబు మిలటరీ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహర్షి విడుదల తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X