వైఎస్ఆర్‌ని చంద్రబాబుగా మార్చేసిన ఆర్జీవీ.. మహానాయకుడుకు వ్యతిరేకంగా!

Recommended Video

RGV Changed YSR Role As Chandrababu In Lakshmi's NTR Movie | Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదల కాగా ఎన్టీఆర్ మహానాయకుడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి దారుణమైన వసూళ్లు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అందరి ద్రుష్టి వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు పాత్ర గురించి అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

లక్ష్మి పార్వతి పాత్ర

లక్ష్మి పార్వతి పాత్ర

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో లక్ష్మి పార్వతి పాత్ర ప్రధానంగా ఉండబోతోంది. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన చివరి మజిలీ వరకు ఈ చిత్రం ఉంటుందని వర్మ ఇదివరకే ప్రకటించాడు. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి మధ్య నెలకొన్న భావోద్వేగ సంబంధం, ఎన్టీఆర్ కుటుంబంలో, రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలని హైలైట్ చేసి వర్మ చూపించబోతున్నాడు.

సంచలనం రేపిన ట్రైలర్

సంచలనం రేపిన ట్రైలర్

ఆ మధ్యన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేయగానే యూట్యూబ్ లో దూసుకుపోయింది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కు 8.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎన్టీఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు, చంద్రబాబు పాత్ర, వైస్రాయ్ సంఘటనని కూడా హైలైట్ చేయబోతున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టం అయిపోయింది.

వైఎస్ఆర్‌ని చంద్రబాబుగా

వైఎస్ఆర్‌ని చంద్రబాబుగా

కాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్య నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో నటుడు శ్రీతేజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించాడు. దర్శకుడు క్రిష్ అతడిని వైఎస్ఆర్ పాత్రలో చూపించిన సంగతి తెలిసిందే. అతడే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబుగా నటిస్తున్నాడు. ఈ విషయంలో కూడా వర్మ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి వ్యతిరేకంగానే వ్యవహరించాడు. ఎన్టీఆర్ మహానాయకుడులో వైఎస్ఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబుగా నటించిన వ్యక్తి శ్రీతేజ్ కావడం విశేషం.

త్వరలో విడుదల

త్వరలో విడుదల

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నాడు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలని అధ్యయనం చేసి, నిజాలు తెలుసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వర్మ ఇది వరకే ప్రకటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X