చిరు తరువాత విజయ్ దేవరకొండతో కొరటాల సినిమా.. ఎలాంటి కథ అంటే!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులలో కొరటాల శివ ఒకరు. పరాజయం లేకుండా దూసుకుపోతోన్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ గా భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ప్రస్తుతం సెన్సేషనల్ హీరో. కొరటాల, విజయ్ దేవరకొండ సినిమా గురించి ఆసక్తికర విషయాలు సినీవర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

సందేశాత్మక చిత్రాలు
కొరటాల ఇప్పటి వరకు దర్శత్వం వహించిన చిత్రాలన్నీ సందేశాత్మక చిత్రాలే. అందులో అద్భుతమైన కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. చిరంజీవితో తెరకెక్కించబోయే చిత్రం కూడా సందేశాత్మక చిత్రమే అని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ కోసం కథ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా కొరటాల శివ దర్శత్వంలో నటిచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన నోటా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు కొరటాల హాజరయ్యారు. విజయ్ కు ఎలాంటి కథ రాయాలో అర్థం కావడం లేదని కానీ తప్పకుండా అతడి కోసం ఓ కథ సిద్ధం చేస్తానని కొరటాల మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.

మెగాస్టార్ సినిమా తరువాత
మెగాస్టార్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండకు కూడా కొరటాల కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ విజయ్ దేవరకొండతో తన శైలికి భిన్నంగా డిఫెరెంట్ కథని సిద్ధం చేస్తున్నాడట. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా యువత మెచ్చే అంశాలతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతా సిద్ధం
ఇక కొరటాల, చిరు చిత్ర విషయానికి వస్తే అంత సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరు ప్రస్తుతం సైరా చిత్రంతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











