అంచనాలు పెంచుతోన్న మహేష్, అనిల్ రావిపూడి చిత్రం.. పవర్ ఫుల్ టైటిల్ వైరల్!

Recommended Video

Interesting Details About Mahesh Babu, Anil Ravipudi Next Movie Title || Filmibeat Telugu

మహర్షి చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. త్వరలో అనిల్, మహేష్ కాంబినేషన్ లోని చిత్రం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించబోయే ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

 క్రేజీ నటీనటులు

క్రేజీ నటీనటులు

అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన నాలుగు చిత్రాలూ ఘనవిజయం సాధించాయి. ఈ ఏడాది విడుదలైన ఎఫ్ 2 చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అనిల్ రావిపూడి మహేష్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంలో నటించబోతున్నారు. బండ్ల గణేష్ కూడా ఈ చిత్రంలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక మందన నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవర్‌ఫుల్ టైటిల్

పవర్‌ఫుల్ టైటిల్

మహేష్, అనిల్ రావిపూడి చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు అంటూ ప్రచారం జరుగుతోంది. సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ని దర్శకుడు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా పవర్ ఫుల్ టైటిల్.. బావుంది అంటూ మహేష్ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ చివరకు అనిల్ రావిపూడి ఎలాంటి టైటిల్ కు ఫిక్స్ అవుతాడో చూడాలి.

సాఫ్ట్ టైటిల్స్

సాఫ్ట్ టైటిల్స్

ఇటీవల మహేష్ బాబు చిత్రాలకు ఎక్కువగా సాఫ్ట్ టైటిల్స్ కి ప్రాధానత్య ఇచ్చారు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను, మహర్షి లాంటి సాఫ్ట్ టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి. అనిల్ రావిపూడి మాత్రం పవర్ ఫుల్ టైటిల్ కే ప్రాధాన్యత ఇస్తున్నాడట. జూన్ రెండవ వారం నుంచి మహేష్, అనిల్ రావిపూడి చిత్రం సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వస్తున్నాయి.

 రైతు సమస్యల నేపథ్యంలో

రైతు సమస్యల నేపథ్యంలో

గత ఏడాది మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. మే 9న విడుదల కాబోతున్న మహర్షి చిత్రం కూడా సందేశాత్మక అంశాలతోనే ఉండబోతోంది. ఈ చిత్రంలో రైతుల సమస్యలని హైలైట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో ప్యారిస్ వెకేషన్ లో ఉన్నాడు. మహేష్ తిరిగొచ్చిన తర్వాత మహర్షి ప్రచార కార్యక్రమాలు మొదలవుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X