కళ్ళు చెదిరే గ్రామంలోకి మహేష్.. స్నేహితుడితో కలసి!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బృందావనం, ఎవడు, ఊపిరి వంటి చిత్రాలతో తన ప్రతిభ నిరూపించుకున్న వంశీ పైడి పల్లి మహేష్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

అమెరికా షెడ్యూల్ ఫినిష్
మహర్షి చిత్రానికి సంబందించిన కీలమైన అమెరికా షెడ్యూల్ పూర్తయింది. మహేష్ బాబు గడ్డం మీసాలతో ఈ చిత్రంలో విభిన్నమైన లుక్ లో కనియించబోతున్నాడు. కానీ యూఎస్ షెడ్యూల్ లో మాత్రం మహేష్ క్లీన్ షేవ్ లో కనియించాడు. దీనితో మహేష్ పాత్ర ఆధ్యంతం వైవిధ్యంగా సాగుతుందనే అంచనాలు మొదలయ్యాయి.

కళ్ళు చెదిరే విలేజ్
అమెరికా షెడ్యూల్ తరువాత మహర్షి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం కళ్ళు చెదిరేలా ఓ విలేజ్ సెట్ ని నిర్మిస్తున్నారట. అబ్బురపరిచే ఆర్ట్ వర్క్ తో ఈ సెట్ ఉండబోతోందని సమాచారం. భారీ ఖర్చుతో ఈ సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

స్నేహితుడితో కలసి
ఈ చిత్రంలో అల్లరి నరేష్ మహేష్ బాబుకు స్నేహితుడి పాత్రలో నటించబోతున్నాడని వినికిడి. అల్లరి నరేష్, మహేష్ మధ్య అద్భుతమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించడానికి దర్శకుడు వంశి పైడిపల్లి సిద్ధం అవుతున్నాడు. మహేష్ సినిమాకు కావలసిన కమర్షియల్ అంశాలతో పాటు మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉండనుంది.

స్టార్ ప్రొడ్యూసర్స్ నిర్మాణంలో
మహర్షి చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో మహర్షి చిత్రం విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా మహర్షి చిత్రం తరువాత మహేష్ సుకుమార్ దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











