క్రికెటర్‌గా నాని.. స్టోరీ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్.. 1980 నాటి కథ!
నేచురల్ స్టార్ నాని నటించబోతున్న జెర్సీ చిత్రం ఇప్పటి నుంచే ఆసక్తి పెంచుతోంది. ఇటీవల విడువులైన టైటిల్ లోగో ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంది. టైటిల్ లోగోలో క్రికెట్ కిట్ చూపించి చిత్రం గురించి హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా జెర్సీ చిత్ర కథ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 1980 దశకం నేపథ్యంలో కథ రాసుకున్నారట. 80, 90 దశకాల మధ్య కాలంలో జరిగే కథ ఇది అంటున్నారు. క్రికెట్ ఆటగాడిగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కళలు కనే యువకుడి కథ ఇది సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నాని ప్రస్తుతం నాగార్జునతో మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. సెప్టెంబర్ లో జెర్సీ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం కోసం నాని క్రికెటర్ గా శిక్షణ కూడా తీసుకోనున్నాడట.


Click it and Unblock the Notifications











