»   » రాంచరణ్, ఎన్టీఆర్ కలసి 20 రోజులు అలా..రాజమౌళా మజాకా, రచ్చ షురూ!

రాంచరణ్, ఎన్టీఆర్ కలసి 20 రోజులు అలా..రాజమౌళా మజాకా, రచ్చ షురూ!

Subscribe to Filmibeat Telugu
అప్పడు ప్రభాస్,రానా ...ఇప్పడు చరణ్, ఎన్టీఆర్

వాడకం అంటే ఏమిటో దర్శక ధీరుడు రాజమౌళికి బాగా తెలుసు. ఆర్టిస్టుల నుంచి పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో రాజమోళి దిట్ట. రాజమౌళి బాహుబలి సినిమా సందర్భంగా ప్రభాస్, రానాని ఎలా కష్టపెట్టాడో అందరికి తెలిసిందే. సినిమాకి సంబంధించి రానా, ప్రభాస్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు. ఇప్పుడు రాంచరణ్, ఎన్టీఆర్ వంతు వచ్చింది. రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికర ప్రచారం మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 దర్శక ధీరుడి భారీ ప్లాన్

దర్శక ధీరుడి భారీ ప్లాన్

బాహుబలి తరువాత రాజమౌళి చేయబోయే చిత్రం గురించి సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌళి భారీ మల్టి స్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు. కథ చర్చలు ముగిశాక ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు.

బాహుబలి తరువాత

బాహుబలి తరువాత

బాహుబలి చిత్రంతో రాజమౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.దీనితో ఎన్టీఆర్,చరణ్ తో తెరకెక్కించబోయే చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు ఎక్కువవుతున్నాయి.

 బాక్సింగ్ నేపథ్యంలో

బాక్సింగ్ నేపథ్యంలో

రాజమౌళి తెరకెక్కించబోయే ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఎన్టీఆర్, రాంచరణ్ కలసి 20 రోజుల పాటు

ఎన్టీఆర్, రాంచరణ్ కలసి 20 రోజుల పాటు

రాజమౌళి మల్టీస్టారర్ చిత్ర ప్రక్రియని వేగం పెంచినట్లు తెలుస్తోంది. జులై నెలలో 20 రోజులపాటు రాంచరణ్, ఎన్టీఆర్ కు వర్క్ షాప్ నిర్వహిస్తారట. ఈ వర్క్ షాప్ లో ఎన్టీఆర్, చరణ్ కు చిత్రానికి సంబందించిన ట్రైనింగ్ ఉంటుంది.

ఆగస్టు నుంచి

ఆగస్టు నుంచి

ఆగస్టు నుంచి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనేది రాజమౌళి ప్లాన్.

చరణ్, ఎన్టీఆర్ కు ఒకేసారి

చరణ్, ఎన్టీఆర్ కు ఒకేసారి

చరణ్, ఎన్టీఆర్ కు ఒకేసారి రాజమౌళి ఒకేసారి పూర్తి కథని వినిపించనున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ చిత్ర కథా చర్చలు పూర్తవుతాయి.

English summary
Interesting details about Ram Charan, NTR multistarrer movie. 20 days workshop for both heros.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu