రాంచరణ్ ర్యాంబో లుక్.. ఎంత కష్టం దాగుందో తెలుసా, బాలీవుడ్ హీరోల తరహాలో!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధం అవుతోంది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఫ్యామిలీ అంశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని ఊరిస్తోంది. రాంచరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో రాంచరణ్ కండలు తిరిగిన బాడీతో అభిమానులని సర్ప్రైజ్ చేశాడు. తుపాకీ పట్టుకుని రాంచరణ్ ర్యాంబో తరహాలో ఉన్న పోస్టర్ వైరల్ గా మారుతున్నాయి.

అజర్బైజాన్‌లో యాక్షన్ సీన్స్

అజర్బైజాన్‌లో యాక్షన్ సీన్స్

రాంచరణ్ కండలు తిరిగిన శరీరంతో ఉన్న సన్నివేశాల్ని అజార్బైజాన్ లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. రాంచరణ్ లుక్ కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో బోయపాటి శ్రీను రాంచరణ్ ని పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు. రాంచరణ్ ర్యాంబో తరహా లుక్ వెనుక చాలా కష్టం దాగుందట. ఈ లుక్ కి సంబంధించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రతి రోజూ 4 గంటలు

ప్రతి రోజూ 4 గంటలు

రాంచరణ్ ఆహార నియాలు పాటిస్తూ జిమ్ లో ప్రతి రోజూ 4 గంటలు కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో రాంచరణ్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ లుక్ కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. రాంచరణ్ షర్ట్ లేకుండా తుపాకీ పట్టుకుని ఉన్న పోస్టర్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. రాంచరణ్ శరీరంపై ఉన్న టాటూ కూడా అభిమానులని ఆకర్షిస్తోంది.

బాలీవుడ్ హీరోల తరహాలో

బాలీవుడ్ హీరోల తరహాలో

బాలీవుడ్ లో కండలు తిరిగిన బాడీ చాలా మంది హీరోలకు ఉంది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, యువ హీరో టైగర్ ష్రాఫ్ తరహాలో రాంచరణ్ ఈ లోక్ ట్రై చేసినట్లు చెబుతున్నారు. ఇక వినయ విధేయ రామ చిత్రంలో రాంచరణ్ ట్రెడిషనల్ లుక్ పంచె కట్టులో కూడా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 14 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. రంగస్థలం తరువాత రాంచరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో వినయ విధేయ రామ బాక్సాఫీస్ వసూళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఉపాసన కూడా

ఇటీవల ఉపాసన కూడా రాంచరణ్ కండలు ప్రదర్శిస్తున్న ఫోటో షూట్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ లుక్ కూడా వైరల్ అవుతోంది.వినయ విధేయ రామ చితం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. డివివి దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో స్నేహ, ఆర్యన్ రాజేష్, తమిళ హీరో ప్రశాంత్ కీలక పాత్రల్లో నటించారు. వివేక్ ఒబెరాయ్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత చరణ్ పూర్తి స్థాయిలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీ కానున్నాడు. వినయ విధేయ రామ తర్వాత మరో ఏడాది వరకు రాంచరణ్ నుంచి సినిమా ఆశించలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X