»   » రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్..'ఆర్'‌లోని గుట్టు, హీరోయిన్లు కూడా అదే విధంగా!

రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్..'ఆర్'‌లోని గుట్టు, హీరోయిన్లు కూడా అదే విధంగా!

Subscribe to Filmibeat Telugu
#RRR: Rajamouli R Sentiment for Heroines

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌలి భారీ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. '#ఆర్‌ఆర్‌ఆర్' హ్యాష్ ట్యాగ్ తో ఇటీవలఈ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఆ మాటకు వస్తే దక్షిణాదిలోనే కనీవినీఎరుగని విధంగా ఈ మల్టి స్టారర్ చిత్రం రూపుదిద్దుకోబోతోంది.

ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలైపోయాయి. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని #ఆర్‌ఆర్‌ఆర్ అనే హ్యాష్ టాగ్ తో పిలుస్తారు. రాంచరణ్, రామారావు(జూ.ఎన్టీఆర్) , రాజమౌళి ముగ్గురి పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరంతో ఈ హ్యాష్ టాగ్ ని క్రియేట్ చేసారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హీరోయిన్ల ఎంపిక విషయంలో కూడా రాజమౌళి ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతుండడం ఆసక్తిని రేపుతోంది.

కలకాలం గుర్తుండిపోయే మల్టీస్టారర్

కలకాలం గుర్తుండిపోయే మల్టీస్టారర్

బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రం తరువాత రాజమౌళి తదుపరి చిత్రం గురించి సినీవర్గాల్లో ఆసక్తి నెలకొనడం ఖాయం. అంచనాలు కూడా పెరుగుతాయి. ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి అనుగుణంగానే రాజమౌళి రాజమౌళి బడా మల్టీస్టారర్ చిత్రానికి పూనుకున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ అభిమానులకు ఎప్పటికి గుర్తుండి పోయే చిత్రంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

ఆసక్తి రేపుతున్న మొదటి అక్షరాల సెంటిమెంట్

ఆసక్తి రేపుతున్న మొదటి అక్షరాల సెంటిమెంట్

ఇటీవలే ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. #ఆర్‌ఆర్‌ఆర్ హ్యాష్ ట్యాగ్ తో ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. రాజమౌళి, రాంచరణ్ మరియు ఎన్టీఆర్ మొదటి అక్షరాలతో ఈ హ్యాష్ టాగ్ ని క్రియేట్ చేసారు. కానీ రాజమౌళి హీరోయిన్ల ఎంపిక విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

'ఆర్' అక్షరంతోనే హీరోయిన్లు కూడా

'ఆర్' అక్షరంతోనే హీరోయిన్లు కూడా

ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఆర్ అక్షరంతో మొదలయ్యే పేర్లు కలిగిన హీరోయిన్లనే రాజమౌళి ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈ సెంటిమెంట్ ని ఎందుకు ఫాలో అవుతున్నాడో అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఆ ముగ్గురు హీరోయిన్ల పేర్లు

ఆ ముగ్గురు హీరోయిన్ల పేర్లు

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇప్పటికే రాశి ఖన్నా పేరు వినిపించింది. తాజగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపిస్తోంది. వీరి పేర్లు ఆర్ అక్షరంతో మొదలవుతుండడంతో రాజమౌళి వీరిని ఎంపిక చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజగా ఛలో ఫేమ్ రష్మిక మందన పేరు కూడా వినిపిస్తుండడం విశేషం.

ఆర్‌లోని మతలబు ఏంటి

ఆర్‌లోని మతలబు ఏంటి

రాజమౌళి తన కథల్లో నిగూఢంగా దాగివున్న అంశం చివరి వరకు బయటపడదు. అదే తరహాలో ఈ ఆర్ లో కూడా ఏదో మతలబు ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ విషయం బయట పడాలంటే స్వయంగా రాజమౌళే నోరు తెరవాలి. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.

English summary
Interesting details on Rajamouli 'R' sentiment. rajamouli searching for heroines
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X