రజనీ గురించి అందరికీ తెలియని ఆసక్తికరమైన విశేషాలు-1
హైదరాబాద్: వెండితెరపై 'స్త్టెల్'శకాన్ని ఆవిష్కరించిన రజనీకాంత్ జన్మదినం ఈ రోజు. ఆయన అభిమానులు ఈ రోజుని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ జీవితంలోని పలు ఆసక్తికరమైన అంశాలు మీ కోసం...
- ప్రతి హోలీ పండుగకు తన గురువు బాలచందర్‌కు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకుంటారు. కానీ ఆ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. తీరా కొన్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'నాకు రజనీకాంత్ అని పేరు పెట్టింది హోలీ రోజునే సార్!'అన్నారట.
- రజనీకాంత్ ఉన్నప్పుడు ఇంటిలో నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు.
- రజనీకాంత్ ఇష్ట దైవం వినాయకుడు.
- తిరుపతి ఆలయంలోనే రజనీకాంత్ వివాహం జరిగింది.
- రోడ్డుపక్కనున్న కాకా హోటళ్ల ప్రియుడు రజనీ. పోరూర్ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఇప్పటికీ వెళ్లొస్తారట.
- ఏవీఎం స్టూడియోలో రజనీకాంత్ మేకప్‌రూమ్ నెం.10
- చెన్నైలో షూటింగ్ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఇంటి నుంచే వెళ్తుంది.
- తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా చేశారు.
- మెరీనాలో విక్రయించే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం.
- 'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్ గుమ్మంపై ఉంటుంది.
- రజనీకాంత్ మాట్లాడిన తొలి పంచ్ డైలాగ్ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?)
- రజనీకాంత్ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు.
- తన చిత్ర షూటింగ్ పూర్తయ్యాక ఆ చిత్ర సహాయ దర్శకుడికి ఓ మొత్తాన్ని కానుకగా ఇవ్వటం రజనీకాంత్ అలవాటు. ఆ మొత్తం కనీసం రూ.50 వేలు.
- తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
- అత్యధికంగా ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించారు.
- హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో కుప్పలతెప్పలుగా ఉంటాయి.
- తనకు నచ్చిన పాటకు సంగీత దర్శకుడెవరో తెలుసుకుని ఫోన్ చేసి వారిని అభినందిస్తారు.
- పోయస్ గార్డెన్ నివాసంలో ఉంటే రజనీకాంత్ నిద్రపోయేసరికి దాదాపు అర్ధరాత్రి అవుతుంది.
- తన ఇంటిలోని పెద్ద అద్దం ముందు నిలబడి రిహార్సల్స్ చేస్తుంటారట.
- తనకు ఎంత ఆప్తులైనా వారికోసం సిఫారసు మాత్రం చేయరు.
- సిగరెట్ తాగటం చాలా ఇష్టం. అయితే ఇప్పుడా అలవాటు మానుకున్నారు.
- స్నేహితుల స్కూటర్‌ను నడపటమంటే చాలా సరదా.
- రజనీకాంత్‌కు ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాదే. ఇళయరాజాను 'స్వామి' అంటూ మర్యాదగా సంబోధిస్తారు.
- పర్సు, క్రెడిట్ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్ మనీగా రూ.500 మాత్రమే తీసుకెళ్తారు.
- అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారిని ఉత్సాహ పరుస్తుంటారు.
- తనతో ఫొటో దిగేందుకు వచ్చే వారిలో చిన్నారులుంటే వారిని ఎత్తుకుని ఫోజివ్వటం రజనీకాంత్ అలవాటు.
- పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి పేరు 'బృందావన్'. ఇది ఆయనే పెట్టుకున్నారు. దానిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో లిఖించారు.
- విమాన ప్రయాణాలకన్నా రైలు ప్రయాణాలకే రజనీకాంత్ మొగ్గుచూపుతారు.


Click it and Unblock the Notifications












