రజనీ గురించి అందరికీ తెలియని ఆసక్తికరమైన విశేషాలు-2

By Srikanya
<ul id="pagination-digg"><li class="previous"><a href="/movies/news/2012/12/interesting-elements-rajinikanth-life-109653.html">« Previous</a>

'తలైవా.. మీ పుట్టినరోజునాడు మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నామ'ని అభిమానులు అడిగితే.. 'అసలు నేనెందుకు పుట్టాననే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ రోజంతా ఏకాంతంగా గడుపుతాను. ప్లీజ్‌ ఆరోజున నన్ను వదిలేయండి'అని పేర్కొంటారు రజనీ.అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన రజనీకాంత్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల సమాహారం మీ కోసం...

  1. కె.బాలచందర్‌పై రజనీకి అపార గౌరవం. ఆయన ఎప్పుడు ఫోన్‌ చేసినా లేచి నిలబడే మాట్లాడతారు. అదీ ఆయన గురుభక్తి.
  2. ఫిలిం ఛాంబర్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో చాలా సందర్భాల్లో ఫీజు కూడా కట్టలేకపోయేవారట. ప్రిన్సినల్‌ రాజారామ్‌దాస్‌సహాయం చేశారట.
  3. తనను కలిసేందుకు ఎవరు వచ్చినా, వయస్సులో చిన్నవారైనా లేచి నిలబడి వారిని ఆహ్వానిస్తారు. వారు కూర్చున్నాకే తాను కూర్చుంటారు.
  4. రజనీకాంత్‌ ఏ కారులో వస్తారనే విషయాన్ని ఎవరూ ముందే ఊహించలేరు. ఖరీదైన కార్లకు దూరంగా ఉండే సూపర్‌స్టార్‌ అంబాసిడర్‌, క్వాలీస్‌లో మాత్రమే ప్రయాణిస్తుంటారు.
  5. బూట్లు ధరించటాన్ని ఇష్టపడరు. షూటింగ్‌ సందర్భంలో కూడా అవసరం మేరకే. చెప్పులు ధరించటమే ఇష్టం.
  6. రోజూ రెండు చిత్రాలను చూడటం అలవాటు. వాటిలో ఒకటి తప్పనిసరిగా ఆంగ్లం ఉంటుంది.
  7. ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం అందించటం రజనీ అలవాటు.
  8. తొలినాళ్లలో నలుపు వస్త్రాలను ఇష్టపడే రజనీకాంత్‌ ప్రస్తుతం తెలుపునకు మారారు.
  9. రజనీకాంత్‌ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లాడ్‌ స్టోన్‌' 1988 అక్టోబరు 7న విడుదలైంది. అక్కడా అభిమానులను సంపాందించిపెట్టింది.
  10. 'నేను ఆధ్యాత్మికవేత్తనే. అయితే ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్నంత కాదు. అలాంటి పద్ధతి నాకు ఇష్టం లేద'ని ఓసారి వ్యాఖ్యానించారు.
  11. తన వద్ద 25 ఏళ్లుగా విధులు నిర్వహించి విరమణ పొందిన వ్యక్తిగత సహాయకుడు జయరామన్‌కు నేటికీ వేతనం అందిస్తూనే ఉన్నారు.
  12. విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా అక్కడి బస్సుల్లో నిల్చొనే ప్రయాణిస్తారు. కారణం అడిగితే కండక్టర్‌ కాలం నాటి అలవాటు అని చెబుతుంటారు.
  13. అల్లుడు ధనుష్‌ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి కంచం, గ్లాస్‌ కానుకగా ఇస్తుంటారు.
  14. 'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు.
  15. తమిళ చిత్రాలు ప్రస్తుతం రష్యా భాషలోకి అనువాదం అవుతున్నాయి. వీటిలో తొలి చిత్రం రజనీకాంత్‌ నటించిన 'చంద్రముఖి'.
  16. ఆభరణాలను రజనీ ఇష్టపడరు. గతంలో రజనీ తన కుడిచేతికి కడియం ధరించేవారు. ఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్‌ కు బహుమతిగా వెళ్లింది.
  17. ఆధ్యాత్మికం కాకుండా ప్రపంచ రాజకీయ నేతల జీవిత చరిత్రల పుస్తకాలను చదవటం రజనీకి చాలా ఇష్టం.
  18. రూ.50 కోట్లతో రజనీకాంత్‌ తిరువళ్లువర్‌గా నటించే చిత్రాన్ని నిర్మించేందుకు ఓ సంస్థ పనులు కూడా ప్రారంభించింది. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.
  19. ఎంజీఆర్‌, శివాజీలంటే మహా ఇష్టం. ఎంజీఆర్‌ తమిళ సినిమా మార్గదర్శి, శివాజీ గణేశన్‌ ఓ నిఘంటువు.. అని అభివర్ణిస్తుంటారు రజనీ.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/movies/news/2012/12/interesting-elements-rajinikanth-life-109653.html">« Previous</a>

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X