2.0 గురించి రజనీ అభిమానులు తెలుసుకోవాల్సిన 8 ఆసక్తికర విషయాలు!

రజనీకాంత్ అభిమానులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్న 2.0 చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. 2010లో వచ్చిన యంతిరన్ చిత్రానికి ఇది సీక్వెల్. అందులో హీరో, విలన్ పాత్రలు రెండూ రజనీ పోషించగా.... 2.0లో చిట్టి రోబోగా రజనీకాంత్, విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు.

ఇండియన్ సినీ చరిత్రలో తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ ఇదే. రోబో చిట్టిని తెరపై ఎప్పుడు చూద్దామా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా చూసే ముందు అభిమానులు ఈ మెగా మూవీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాల్సిందే.

మెయిన్ విలన్

మెయిన్ విలన్

యంతిరన్(రోబో)లో మాదిరిగా చిట్టి రూపంలోనే ఉండే విలన్ కాకుండా... ఈ సారి సరికొత్త విలన్‌ను దర్శకుడు శంకర్ రంగంలోకి దింపారు. ఈ పాత్రకు ముందు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్‌స్వార్జ్ నెగ్గర్ అనుకున్నప్పటికీ పలు కారణాలతో అది వర్కౌట్ కాలేదు. తర్వాత అమీర్ ఖాన్‌కు ఈ కథ చెప్పి విలన్ పాత్ర చేయాలని అడగాలనుకున్నారు కానీ ఆలోపే అనుకోకుండా అక్షయ్ కుమార్ కథ వినేసి చేయడానికి ఆసక్తి చూపడంతో ఆయన్నే ఫైనల్ చేశాడు శంకర్. అక్షయ్ ఈ చిత్రంలో డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో క్రౌమ్యాన్‌గా కనిపించబోతున్నారు.

రజనీకాంత్ డబుల్ డోస్

రజనీకాంత్ డబుల్ డోస్

రజనీకాంత్ అభిమానులకు 2018 డబుల్ డోస్ అని చెప్పక తప్పదు. 1995 తర్వాత రజనీకాంత్ సినిమాలు ఒకే ఏడాది రెండు విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జూన్లో రజనీ ... పా రంజిత్ దర్శకత్వంలో చేసిన ‘కాలా' విడుదలైన సంగతి తెలిసిందే. 2014లో లింగా, కొచ్చాడియాన్ వచ్చినప్పటికీ కొచ్చాడియాన్‌లో రజనీకాంత్ కనిపించకుండా అతడి కార్టూన్ రూపం మాత్రమే కనిపింది కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

మెగా బడ్జెట్ మూవీ

మెగా బడ్జెట్ మూవీ

2.0 చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే మెగా బడ్జెట్ మూవీ. ఈ సినిమా కోసం దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 3డి ఫార్మాట్లో తెరకెక్కించిన మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఇండియన్ మూవీ కూడా ఇదే.

3డి ఎఫెక్ట్

3డి ఎఫెక్ట్

ఇటీవల ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని 2డిలో చిత్రీకరించి 3డిలోకి కన్వర్ట్ చేయడం కాకుండా నేరుగా 3డిలో చిత్రీకరించారు. దీని కోసం లేటెస్ట్ 3డి కెమెరా వాడారు. అందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది అని తెలిపారు.

విజువల్ ఎఫెక్ట్స్

విజువల్ ఎఫెక్ట్స్

2.0లో అత్యంత ప్రధానమైనవి విజువల్ ఎఫెక్ట్స్. ఈ సినిమా కోసం 15కు పైగా వరల్డ్ లెవల్ విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేశాయి. 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు. పూర్తిస్థాయి త్రీ డీ టెక్నాల‌జీతో.. 4డీ సౌండింగ్‌తో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా `2.0`.

మేకప్ కోసం అధిక సమయం

మేకప్ కోసం అధిక సమయం

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మేకప్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇందులో ఆయన్ను క్రౌమ్యాన్ లుక్‌లో కనిపించడానికి ప్రోస్తటిక్ మేకప్ వేశారు. ఈ మేకప్ కోసం అక్షయ్ కుమార్ ప్రతి రోజూ గంటల సమయం వెచ్చించారు.

 రజనీకాంత్-అక్షయ్ కుమార్

రజనీకాంత్-అక్షయ్ కుమార్

రజనీకాంత్-అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. గతంలో రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి' చిత్రం హిందీ రీమేక్‌ భూల్ భులయ్యాలో అక్షయ్ నటించారు. అయితే ఇద్దరూ ఒకే సినిమాలో నటించడం ఇదే తొలిసారి.

 భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో అత్యధిక వసూలు చేసింది చిత్రంగా 2.0 మూవీ నిలిచింది. శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ చిత్రానికి ఇప్పటికే రూ. 370 వసూలు అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X